News
News
వీడియోలు ఆటలు
X

JPS Strike: జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై సర్కారు సీరియస్, విధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని హెచ్చరికలు

JPS Strike: ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. 

FOLLOW US: 
Share:

JPS Strike News: తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు విధుల్లో చేరాలని జేపీఎస్ లకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే.. విధుల్లో చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం.. నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, స్మమెకు దిగడం చట్ట విరుద్ధం అని తెలిపారు. ప్రభుత్వంతో కుదుర్కుచుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్ తో 2023 ఏప్రిల్ 28వ తేదీ నుంచి జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సుల్తానియా పేర్కొన్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తను సొసైటీలు, యూనియన్లలో చేరనని బాండ్ పై సంతకం చేశారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేది ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి... చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28వ తేదీ 2023 నుంచి సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చవరి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాల సాయంత్రం లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

Published at : 09 May 2023 12:26 PM (IST) Tags: Telangana News JPS Strike Telangana TS Govt on JPS Junior Panchayat Secretaries JPS Strike News

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?