అన్వేషించండి

Jagtial Master Plan: జగిత్యాలలో కామారెడ్డి సీన్ రిపీట్, మాస్టర్ ప్లాన్‌కి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు ధర్నా

జగిత్యాల - నిజామాబాద్ జాతీయ రహదారిపై గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆటోలు, ట్రాక్టర్ పై గ్రామస్థులు భారీగా తరలి వచ్చి ధర్నా చేశారు.

ఇటీవల కామారెడ్డి రైతులు చేసిన తరహాలోనే ఇప్పుడు జగిత్యాల రైతులు కూడా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం అంబర్ పేట గ్రామ ప్రజలు జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రీయల్ జోన్ ను ఎత్తి వేయాలని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జగిత్యాల - నిజామాబాద్ జాతీయ రహదారిపై గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆటోలు, ట్రాక్టర్ పై గ్రామస్థులు భారీగా తరలి వచ్చి ధర్నా చేశారు. గ్రామస్తులందరూ కలిసి రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగించాలని, గ్రామ ప్రజలు, రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై నిలిచిన వాహనాల వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ కు తీర్మానాలు

అంతకుముందు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తిమ్మాపూర్ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. పలు గ్రామాల ఏకగ్రీవ తీర్మానాలను గ్రామస్థులు మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు.

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

మాస్టర్ ప్లాన్ అంటే

జగిత్యాల మాస్టర్ ప్లాన్ పరిధిలో నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హుస్నాబాద్, లింగంపేట, మోతె గ్రామాలను చేర్చాలనే ప్రతిపాదన ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ కు అవసరమైన భూమిని సేకరిస్తారు. దీంతో ఆయా గ్రామాల రైతులు భూములు కోల్పోతామంటూ ఆందోళన చెందుతున్నారు.

మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డిలో నిరసనలు 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని కొన్ని రోజుల క్రితం రైతులు ఆందోళన చేస్తున్నారు. మహా ధర్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలో 8 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పై బుధవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. గురువారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే బాధిత రైతులు కామారెడ్డి పట్టణానికి చెందిన 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని వినతి పత్రాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget