Secunderabad Riots: సికింద్రాబాద్ ఘటనలో కామారెడ్డి యువకులు? ఇంటెలిజెన్స్ ఆరా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటనలో కామారెడ్డికి చెందిన యువకులు ఉన్నట్లు ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో 3 రోజుల క్రితం జరిగిన ఘటనపై జిల్లాకు చెందిన ఆర్మీ అభ్యర్థులు, యువతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2021 అక్టోబర్ నెలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించిన తర్వాత సెలక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా పరీక్ష వాయిదా పడింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు రైల్వే బోగీలను, ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిజామాబాద్ నుంచి ఆర్మీకి సంబంధించిన శిక్షణ పొందిన యువకులపై పోలీసులు మండలాలు, గ్రామాల వారీగా ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటనలో కామారెడ్డికి చెందిన యువకులు ఉన్నట్లు ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొందరు యువకులు ఘటనలో గాయాలయ్యాయనే ప్రచారం కామారెడ్డిలో జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వివరాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంత మంది కామారెడ్డికి చెందిన యువకులు ఉన్నా రో..? నిజామాబాద్ లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో సీసీ పుటేజీల ద్వారా స్పష్టం కానుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో నరసరావు పేటకు చెందిన అకాడమీ పేరు బయటకు వచ్చింది. ఈ అకాడమీలో జిల్లాలో చాలామంది ఆర్మీ రిక్రూట్మెంట్ సమయంలో శిక్షణ పొందారు. వారితో పాటు జిల్లాలో ఉన్న డిఫెన్స్ కోచింగ్ సెంటర్లపై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలి జెన్స్ పోలీసులు నిఘా పెట్టారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అభ్యర్థులు హైదరాబాద్, కరీంనగర్ ఉన్న కోచింగ్ సెంటర్లలో రాత పరీక్షకు సిద్ధమవుతున్నారని, వారితో నిజామాబాద్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. కోచింగ్ సెంటర్లలోని వివరాల ద్వారా అభ్యర్థుల సమాచారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సికింద్రాబాద్ ఘటన పై డిఫెన్స్ అకాడమీల పాత్ర ఎంతవరకు ఉన్నదనే చర్చ జిల్లాలో కొనసాగుతుంది.
నిజామాబాద్ సీపీ నాగరాజు సూచనతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన తర్వాత అజంతా ఎక్స్ ప్రెస్ లో వచ్చిన యువకులు నిజామాబాద్ రైల్వేస్టేషన్ పై దాడి చేస్తారనే సమాచారం మేరకు సీపీ నాగరాజు పోలీసులు పహా రాను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ గేట్ నుంచి ప్లాట్ ఫారంతోపాటు రైల్వే స్టేషన్ పక్కల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీంతో అజంతా ఎక్స్ ప్రెస్ లో వచ్చిన యువకులు ఎలాంటి ఘటనలు పాల్చకుండా వెనుదిరిగినట్లు ప్రచారంలో ఉంది. రైల్వేస్టేషన్లో డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష న్లో ఆందోళనకు దిగిన నిజామాబాద్ యువ కులపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మంది పాల్గొన్నారు. వారి ప్రమేయం ఎంత అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.