Adilabad Rains: ఆదిలాబాద్‌లో భారీ వర్షాలలు- మంత్రి సమీక్ష జరుగుతుండగానే కలెక్టరేట్‌లో ప్రమాదం
Adilabad Rains: మంత్రి సమీక్ష జరుగుతుండగానే ఆదిలాబాద్‌లో కలకలం రేగింది. సమావేశానికి పక్కనే ఉన్న భవనం కుప్పకూలింది. వర్షాలకు ఈఘటన జరిగింది.

Adilabad Rains: ఉపరితల ఆవర్తనం ప్రభాంతో ఆదిలాబాద్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి కలెక్టరేట్ భవనం ధ్వంసమైంది. ఓ వైపు మంత్రి సమీక్ష నడుస్తున్న టైంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నడుస్తోంది. ఇంతలోనే భారీ శబ్దంతో వరండా కూలిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బోథ్, ఖానాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, పంపిణీ చేసి, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనం ప్రారంభించారు. అనంతరం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతుండగానే కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఉన్న మొదటి అంతస్తు భవనం వరండా కూలిపోయింది. ఏ సెక్షన్‌కు చెందిన బాల్కనీ కూలిపోగా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాతకాలంలో నిర్మించిన భవనం ఇదివరకే పలుచోట్ల స్లాబ్ పెచ్చులు కూలుతూనే ఉన్నాయి. త్వరగా కొత్త కలెక్టరేట్ భవనం పూర్తయితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అందరూ చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా కలెక్టరేట్ లో కూలిన భవనం వద్ద సంబంధిసంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు





















