Congress News: సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసిన ఎమ్మెల్యే, ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి
Telangana News | సమగ్ర కుటుంబ సర్వేలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని తన కుటుంబ వివరాలు నమోదు చేశారు. ప్రజలంతా సర్వేలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరారు.
Telangana Family Survey | ఖానాపూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని తన స్వగ్రామం కల్లూరుగూడాలో సోమవారం (నవంబర్ 11న) నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే వెడ్మ బొబ్జు పాల్గొన్నారు. తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి సర్వే చేస్తోంది.
సమగ్ర సర్వేలో పాల్గొని తన కుటుంబ వివరాలు నమోదు చేసిన అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే పట్ల సామాజిక మధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలేవరు నమ్మొద్దని అన్నారు. విద్యావంతులు సర్వేకు వ్యతిరేకంగా సామాజిక మధ్యమాల్లో మాట్లాడడం విచారకరమన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ రంగాల్లో సమన్యాయం చేయడానికిగానూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలబెట్టేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కుల గణన చేపట్టాం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర సర్వే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వంజిరిలో, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న సర్వే తీరును ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి పరిశీలించారు.
Also Read: KTR vs Ponguleti: కేటీఆర్ ను మంత్రి పొంగులేటి ఎందుకు టార్గెట్ చేశారు? కారణాలు ఇవేనా!
ప్రత్యేక అధికారి కృష్ణా ఆదిత్య మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తయినందున కుటుంబ సభ్యుల సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లలో పూర్తిస్థాయిలో వివరాలు నిర్మిత నమూనాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని, అవసరమైన పత్రాలతో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్వే లో భాగంగా ఎన్యుమేటర్లకు అందించిన నమూనాలో ప్రతి అంశాన్ని తప్పనిసరిగా నింపాలని సూచించారు.
Also Read: Revanth Reddy: యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్