Bhatti Vikramarka: 2 రోజులకే పాదయాత్ర ఆపేస్తానన్నారు, జనం అరచేతిలో పెట్టుకొని నడిపించారు: భట్టి విక్రమార్క
రాష్ట్రం ఏర్పడే సమయంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
CLP Leader Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాంపు వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఉందని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఆదిలాబాద్ జిల్లా సమస్యల కు పరిష్కారం చూపిస్తాం
మంచిర్యాలలో నిర్వహించిన సత్యగ్రహ దీక్ష (Congress Party Meeting In Mancherial) సభ ప్రజల మద్దతు తమకు ఉందని నిరూపించిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భట్టి విక్రమార్క క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంచిర్యాలలో సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల కు పరిష్కారం చూపిస్తాం అన్నారు. సహజ వనరులను సరిగా వాడుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని, ఇక్కడ ఉన్న సహజ వనరులను ప్రభుత్వం ధ్వంసం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్..
1) పిప్పిరి నుంచి పాదయాత్ర ప్రారంభం అయినప్పుడు.. ఒక్కటి రెండు రోజులకు పాదయాత్ర ఆపేస్తారు అని కొందరు అన్నారు. కానీ ఇక్కడి జనం నన్ను అరచేతిలో పెట్టుకొని నడిపించారు. ఆదివాసీల ప్రేమ, గిరిజనేతరుల పార్టీ శ్రేణుల ప్రోత్సాహాంతో ముందుకు నడిపించింది.
2) తెలంగాణ రాష్ట్రంలో అనేక సహజ వనరులు ఉన్నాయి. సరిగా వాడుకుంటే సస్యశ్యామలం అయ్యేది. ఇక్కడ ఉన్న సహజ వనరులను ప్రభుత్వం ధ్వంసం చేసింది.
3) సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోడు హక్కులని కాలరాసింది. వారికి భూమి హక్కు పట్టాలను ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసింది బీఆర్ఎస్ సర్కార్.
4) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.
5) 18 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేని పరిస్తితి ఉంది.
6) మిగులు బడ్జెట్ ఉంటే 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయి.
7) మిషన్ భగీరథ, కాలేశ్వరం స్కాం లని చూపెట్టి దేశ మొత్తం ఇదే మోడల్ అభివృద్ధి చేస్తావా...
8) కేసీఆర్ కు శిక్షా సమయం ఆరంభం అయింది.
9) బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పెట్టిన స్కీం ఏది సక్సెస్ అయింది.
10) అర్హులైన పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూంలు ఏవి.. అన్ని పథకాలను సర్వ నాశనం చేసారు.
11) మళ్లీ ఎన్నికలు వస్తున్నా సీఎం కేసీఆర్ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు.
12) బిఆర్ఎస్ సర్కార్ కు జడ్జ్ మెంట్ డే త్వరలోనే వస్తుంది, అందుకు సిద్ధంగా ఉండాలి అన్నారు భట్టి విక్రమార్క.