Adilabad News: కొత్త మండలాల ఏర్పాటుపై ఆదిలాబాద్ ప్రజల సంబరాలు, ఎమ్మెల్యేకు సన్మానం
New Mandals In Telangana: ఆదిలాబాద్ జిల్లాలో మరో మూడు నూతన మండలాల ఏర్పాటుకై సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో నూతన మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
New Mandals In Telangana: ఆదిలాబాద్ జిల్లాలో మరో మూడు నూతన మండలాల ఏర్పాటుకై సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో నూతన మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జైనథ్ మండలంలో సాత్నాల, బోరజ్ రెండు నూతన మండలాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్నకు ఆ మండలాల ప్రజలు, బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శనివారం తరలివచ్చిన జైనథ్ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే కు శాలువా కప్పి, పూల బొకేలు అందించి, స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని అతిపెద్ద మండలమైన జైనథ్ లో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటు కు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అసిఫాబాద్ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ కు కొత్త మండల కోసం ఎమ్మెల్యే జోగు రామన్న విన్నవించడంతో నూతన మండలాలకు సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎంపిపి మరిశెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, బోరజ్ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, నాయకులు చంద్రయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాల్లోనీ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. శుక్రవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్నతో కలిసి సిఎం కేసీఆర్ దృష్టికి నూతన మండలాల విషయాన్ని తీసుకెల్లారు. దీంతో వెంటనే స్పందిచిన సీఎం కేసీఆర్ తన ఫోన్ లో అధికారులతో మాట్లాడి నూతన మండలాలు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వారు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నూతనంగా సోనాల, సాత్నాల, బోరజ్ మూడు మండలాల పేర్లు ఖరారైనట్లు వారు తెలిపారు.
ప్రజల వెసులుబాటు, సకల సౌకర్యాల కొసం నూతన మండలాల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మండలాల్లోనీ ప్రజలు తమ ప్రజా ప్రతినిదులైన మాజీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మేల్యే జోగు రామన్న లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, తాంసి, భీంపూర్ జడ్పీటీసీలు టి.రాజు, కుమ్రం సుధాకర్ తదతరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నూతన జిల్లాలతో పాటు నూతన మండలాలు ఇదివరకే ఏర్పడ్డాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోను కొత్తగా మండలాలు ఏర్పడినా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా అదిలాబాద్ జిల్లాలో సోనాల, సాత్నాల నూతన మండలాలు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కళ ఎట్టకేలకు నెరవేరింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial