Adilabad News: ప్రాణం తీసిన క్రికెట్ సరదా - బావిలో పడ్డ బాల్ తీయబోయి విద్యార్థి మృతి
గ్రామంలో వ్యవసాయ బావిలో పడ్డ క్రికెట్ బాల్ తీయబోయి బావిలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఈ విషాదం జరిగింది.
A Youth dies after he fell into a Well in Untoor Mandal:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండంలోని శంకర్ నాయక్ తాండ గ్రామంలో వ్యవసాయ బావిలో పడ్డ క్రికెట్ బాల్ తీయబోయి బావిలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై సుమన్ భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ నాయక్ తాండకు చెందిన ఆడే ఆర్యన్(18) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు. కానీ జరగనున్న విషాదాన్ని ఊహించలేకపోయాడు.
ఒక్కగానొక్క కుమారుడు ఆ ఇంటర్ విద్యార్థి
ఈ సందర్భంలో క్రికెట్ బాల్ సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది. బాల్ ను బయటకు తీయడానికి వెల్లిన ఆర్యన్ బావిలో జారిపడినాడు. బావి పూడిక ఉండడంతో పూడికలో కూరుకుపోయి మృతి చెందడం జరిగిందని పేర్కొన్నారు. కాగా.. ఆడే పాండుకు ఒకే కుమారుడు ఆర్యన్ ఉట్నూర్ పులాజి బాబా కళాశాలలో ఇంటర్ (Inter Student Dies While Playing Cricket) చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా క్రికెట్ ఆడుతూ బంతికోసం వెళ్లి బావిలో పడి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ సుమన్ తెలిపారు.
పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
Nirmal News: పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ.. ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు హాయిగా డ్యాన్స్ చేసిన ఆయన నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.
అసలేం జరిగిందంటే..?
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం జరిగింది. శనివారం పార్డి(కె)లో వివాహ వేడుకకు సంబంధించిన విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు... మిత్రుడైన మహారాష్ట్రలోని శివ్ ని గ్రామానికి చెందిన 19 ఏళ్ల ముత్యం అనే యువకుడు కూడా విందుకు హాజరయ్యాడు. అయితే బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటహూటిన వైద్య సేవల కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి కోసం వచ్చి బంధువులు, స్నేహితులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
పడవ బోల్తా.. ఏపీ మంత్రి కాకాణి స్వగ్రామంలో విషాద ఛాయలు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామమంతా చెరువు దగ్గరకు తరలి వచ్చింది. ఒక్కో మృతదేహం బయటకు వస్తుండటంతో వారంతా కన్నీరు మున్నీరయ్యారు. చెరువు వద్దే వారంతా ఉన్నారు. మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. గల్లంతయిన ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వ్యక్తి కూడా జీవించి ఉంటాడనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.