News
News
X

Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్‌ లో పరిస్థితి ఉద్రిక్తం!

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Adilabad News: పత్తికి కనీస మద్దతు ధర రూ.15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం రైతులు బంద్ చేపట్టగా.. ఆసిఫాబాద్‌, వాంకిడిలో రైతుల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. అనంతరం ఆసిఫాబాద్‌ - వాంకిడి జాతీయ రహదారిపై రైతులు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రహదారి లైన్ క్లీయర్ అయ్యాక పోలీసులు రైతులను వదిలి పెట్టారు. అటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లోనూ రైతులు రాస్తారోకో చేపట్టారు.

గత కొన్ని రోజులుగా కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు అన్నదాతలు పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ముందుగానే రైతులు ఆసిఫాబాద్ జిల్లా బంద్ కు పిలుపునివ్వగా... ఆసిఫాబాద్‌ వాంకిడి మండలాల్లో రైతులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అనంతరం ఆసిఫాబాద్‌ - వాంకిడి మద్య పెద్దవాగు సమీపంలో పత్తి రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేపట్టగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రైతులను ఆందోళన విరమింప జేసేందుకు ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలలో స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు. రహదారి లైన్ క్లీయర్ అయ్యాక రైతులను వదలిపెట్టారు. 

అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా..

ఆదిలాబాద్ లో ఆందోళన చేపట్టిన పత్తి రైతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు మద్దతు తెలుపుతూ రాస్తారోకో చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర సర్కారు అన్నదాతల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ ఆరోపించారు. పత్తి రైతుకు మద్దతు ధరను పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంట పాటు రోడ్డును నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షపాతంతో ఈసారి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చిందని, దీంతో పెట్టుబడులు సైతం ఎల్లక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. రోజు రోజుకు పత్తి ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.

అటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోను రాస్తారోకో చేపట్టారు. పత్తి పంటకు మద్దతు ధర రూ 15 వేల వరకు పెంచేంత వరకు రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినోద్ నాయక్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండించిన పత్తి పంటకు ధర పెంచకపోవడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అధాని చేతులతో దేశాన్ని పెట్టీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. రైతులకు ఎల్లపుడూ అండగా ఉంటుందని అన్నారు.

Published at : 06 Feb 2023 09:53 PM (IST) Tags: Adilabad News Farmers Dharna Farmers Problems Telangana News Cotton Farmers

సంబంధిత కథనాలు

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?

TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?

Biometric Attendance: ఇక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!

Biometric Attendance: ఇక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!

Nizamabad: నిజామాబాద్‌లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య, మూడు నెలల్లో ఇద్దరు బలవన్మరణం

Nizamabad: నిజామాబాద్‌లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య, మూడు నెలల్లో ఇద్దరు బలవన్మరణం

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?