Congress: రిజర్వేషన్ విషయంలో కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై ఎస్సీ,ఎస్టీ, బీసీలను మోసం చేశాయి !
బీజేపీకి బి టీంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, రిజర్వేషన్ విషయంలో ఎస్సీ,ఎస్టీ, బిసి ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మకై మోసం చేశాయని వేడ్మ బొజ్జు పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్వర్యంలో భారత్ జోడో యాత్ర చేశారని టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. బిజెపి ప్రజలలో సృష్టించిన వాతావరణాన్ని పోగొట్టి సోదర భావాన్ని నెలకొల్పడానికి భారత జోడో యాత్ర జరిగిందన్నారు. బీజేపీకి బి టీంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, రిజర్వేషన్ విషయంలో ఎస్సీ,ఎస్టీ, బిసి ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మకై మోసం చేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామనే విషయం హామీకే పరిమితం అయిందని, ప్రత్యేక నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని బొజ్జు పటేల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ బొజ్జు పటేల్ సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తదనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలోని గంగన్నపెట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. రామాలయం వద్ద చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం దర్గాలో నమాజ్ నిర్వహించి, అనంతరం మైన్ రోడ్ మీదుగా వెళ్లి బిలివర్ చర్చిలో ఫాస్టర్ జోషఫ్ అధ్వర్యంలో ప్రార్థనలు జరిపారు. అనంతరం ఐబీ చౌక్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం టిపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ అధ్వర్యంలో భారత్ జోడో యాత్ర చేశారన్నారు. బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కై రిజర్వేషన్ విషయంలో ఎస్సీ,ఎస్టీ, బిసిలను మోసం చేశాయని ఆరోపించారు. ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనే విషయం హామీకే పరిమితం అయిందని, ప్రత్యేక నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చిరు వ్యాపారుల పరిస్తితి దయనీయంగా తయారైందన్నారు. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని బొజ్జు పటేల్ అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపి హిందూ పేరు మీద గలీజ్ పొలిటిక్స్ చేస్తుందని, ఆదివాసీ, దళిత, మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు బొజ్జు పటేల్. మాజీ ఎంపి రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆస్తులను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారని, ఖానాపూర్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం అనే అంశాలలో పూర్తిగా విఫలమైరయ్యారని పేర్కొన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే విషయంలో మోసం చేశారని ఆరోపించారు. సదర్మాట్ ప్రాజెక్ట్ నిర్మల్ కు తరిలిపోవడం వెనుక ఎమ్మెల్యే రేఖా నాయక్ వైఫల్యమే కారణమన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలే ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం కావాలన్నారు.