అన్వేషించండి
Advertisement
Nizamabad News: తన కన్నబిడ్డలను చూడనివ్వని భర్త- ఎస్పీకి వివాహిత ఫిర్యాదు
భర్త వేధింపులు తాళ లేక తల్లిదండ్రుల వద్దే ఉంటున్న ఓ వివాహితను కన్నబిడ్డలను కూడా చూడనివ్వడం లేదు. భార్య అక్క, చెల్లిని సైతం కొట్టాడు భర్త.
తాళికట్టిన భర్త ఆమెకు యముడిలా మారాడు. నిత్యం ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. భర్త వేధింపులు తాళలేక ఆ వివాహిత తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన శివరంజనికి నిత్యం భర్త వేధిస్తున్నాడని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. సిరికొండ మండలం నర్సింగ్ పల్లికి చెందిన శ్రీధర్ తో శివరంజనికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భర్త వేధింపుల కారణంగా శివరంజని గుత్పలో తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది.
ఈ నెల 6న పిల్లలను చూసేందుకు సిరికొండ మండలం నర్సింగ్పల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్లినట్లు శివరంజని సీపీ నాగరాజు తెలిపింది. పిల్లలను చూడనీయకుండా అడ్డుపడ్డారని అంతేకా కుండా భర్త శ్రీధర్ తనను కొట్టాడని సీపీ నాగరాజు ఎదుట శివరంజని కన్నీరు పెట్టుకుంది.
అద్దెకు తీసుకుని వెళ్లిన కారు అద్దాలను ధ్వంసం చేశాడని సీపీకి తెలిపింది. తనతోపాటు వచ్చిన మా అక్కా చెళ్లెళ్లు రాధిక, లలితను సైతం చితకబాదాడని వాపోయింది. సిరికొండ పోలీసుల సమక్షంలో కొట్టినా ఎవరూ పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యింది. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీపీ ఎదుట బాధితురాలు శివరంజని ఆవేదన వ్యక్తం చేసింది.
పిల్లలను చూడడానికి పోలీసులు సహాయం కోరినా సహకరించడం లేదని సీపీకి వివరించింది. భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని సీపీ నాగరాజుని వేడుకుంది. దీంతో స్పందించిన సీపీ అక్కడే ఉన్న ఏసీపీ వెంకటేశ్వర్‌కు కేసును పరిశీలించాలని ఆదేశించారు. ఏసీపీ బాధిత మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితురాలు శివరంజని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపిస్కిన్ వ్యాధి కలకలం- అధికారులు అప్రమత్తం
Also Read: బుస్సాపూర్ బ్యాంక్ దోపిడీ కేసులో మరో నిందితుడి అరెస్ట్, పరారీలో మరో 18 మంది
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
బిజినెస్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion