అన్వేషించండి
Advertisement
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపిస్కిన్ వ్యాధి కలకలం- అధికారులు అప్రమత్తం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లంపిస్కిన్ కలకలం రేపుతోంది. వ్యాధి వ్యాప్తిపై అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పశువులకు లంపిస్కిన్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పాడి రైతుల్లో ఆందోళన నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం సాటాపూర్ పశువుల సంత ఫేమస్. ఇక్కడ మహారాష్ట్ర నుంచి భారీగా పశువులను తీసుకొస్తారు. అక్కడి నుంచి వస్తున్న పశులవుల వల్ల నిజామాబాద్ జిల్లాలో పశువులకు లంపిస్కిన్ వ్యాధి వ్యాపించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లంపిస్కిన్ వ్యాప్తితో పశువుల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందన్న ఆవేదన చెందుతున్నారు. క్రయవిక్రయాలు జరిగే పశువుల సంతతో వ్యాధి వ్యాప్తి జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లంపి స్కిన్‌తో ఉమ్మడి జిల్లాలో పశువులు ప్రమాద బారిన పడుతోందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
వేగంగా లంపిస్కిన్ వ్యాధి వ్యాప్తి..
ఉమ్మడి జిల్లాలో 3లక్షలకుపైగా పశువులు ఉన్నాయని సంబంధిత శాఖ అంచనా వేస్తోంది. ఇందులో తెల్లజాతి ఆవులు, గేదెలు ఉన్నాయి. ఆవుల్లోనే లంపి స్కిన్ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. నందిపేట, రెంజల్ మండలంలో 5 ఆవులకు లంపి స్కిన్ లక్షణాలు బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. నవీపేట, డిచ్‌పల్లి మాక్లూర్, వర్ని, చందూరు మండలాల్లో చాలా పశువులకు వైరస్ బారిన పడ్డట్టు పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు రావడం, పూర్తిగా బలహీనపడడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు రైతులు. పశువులపై బొబ్బలు కనిపించగానే పాడి రైతులు వాటిని మందల నుంచి వేరు చేస్తున్నారు. మరి కొందరికి వ్యాధిపై అవగాహన లేక మందలోనే ఉంచుతున్నారు. దీంతో తెల్లజాతి ఆవుల్లో వేగంగా లంపిస్కిన్ విస్తరిస్తోందని అంటున్నారు. పశువైద్యాధికారులు వ్యాధి లక్షణాలు బయట పడగానే గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 40వేలకుపైగా తెల్లజాతి పశువుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 7 వేల పశువులకు వ్యాక్సినేషన్ చేశారు.
జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి సాటాపూర్ మార్కెట్‌కు బోధన్ సాలూరా, కందకుర్తి మీదుగా పశువులు తరలిస్తారు. కర్నాటకలోని ఔరద్, బీదర్ జిల్లాల నుంచి మాసాయిపేట్, సలాబత్‌పూర్, జుక్కల్ నుంచి పశువులు తరలిస్తారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ అంగడిలో ప్రతి శనివారం పశువుల మార్కెట్‌లో మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు జిల్లాల నుంచి పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. సాటాపూర్ అంగడికి సుమారు 10 వేల వరకు పశువుల విక్రయాలు ఉంటాయి. జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు పశువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. జిల్లాలోని పలుచోట్ల కొనసాగుతున్న పశువుల మార్కెట్ లను బంద్ చేయాలని పాడిరైతులు కోరుతున్నారు. సాటాపూర్, వర్ని, బోధన్ , బోర్గాం తదితర ప్రాంతాల్లో, మార్కెట్ లపై కూడా ఆంక్షలు విధించాలని డిమాండ్ వస్తోంది.
లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి చెందకుండా పశుసంవర్ధక శాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని ప్రజలు రిక్వస్ట్ చేస్తున్నారు. పాడి రైతులకు అవగాహన కల్పించాలని అడుగుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులకు యుద్ధ ప్రాతిపదికన గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ కూడా అన్ని పశు వైద్యశాలలకు పంపిణీ చేయాలంటున్నారు. పాడి పరిశ్రమ ఎక్కువగా ఉన్న బోధన్, బాన్స్ వాడ, నిజామాబాద్ రూరల్ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలి. పాడి రైతులకు లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను వివరించాలని వేడుకుంటున్నారు. పశువుల మందలో లంపిస్కిన్ లక్షణాలు కనిపించగానే పశువైద్యులకు రైతులు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement