Nagarsole Express : అటవీ ప్రాంతంలో ఆగిన ట్రైన్, ఆందోళన గురై మహిళకు గుండెపోటు!
Nagarsole Express : నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సంధ్య అనే మహిళకు గుండెపోటు వచ్చింది. అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా రైలు ఆగడం కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూసి ఆమె ఆందోళనకు గురయ్యారు.
Nagarsole Express : నర్సాపూర్- నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సంధ్య అనే మహిళకు హార్ట్ ఎటాక్ వచ్చింది. సికింద్రాబాద్ కు చెందిన సంధ్య బాసర నుంచి నిజామాబాద్ వస్తుండగా మధ్యలో మార్గమధ్యలో గుండెపోటు వచ్చింది. ట్రైన్ లో నల్ల బెల్లం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో సమాచారం తెలుసుకున్న నల్ల బెల్లం అక్రమ రవాణా దారులు ధర్మాబాద్- బాసర అటవీ ప్రాంతంలో చైన్ లాగి పరారయ్యారు. అటవీ ప్రాంతంలో ట్రైన్ ఆగడంతో ప్రయాణికురాలు సంధ్య ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఛాతిలో నొప్పి మొదలైంది. ముగ్గురు నల్ల బెల్లం అక్రమ రవాణా చేస్తున్న వారిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 బ్యాగుల నిషేధిత బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారమంతా చూసిన సంధ్య షాక్ కు గురయ్యారు. ఆమె ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. అప్రమత్తమైన రైల్వే టీటీ నిజామాబాద్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిజామాబాద్ చేరుకోగానే సంధ్యను అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంధ్య షిరిడి సాయి దర్శనం చేసుకుని సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
దేహ దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థికి గుండెపోటు
వరంగల్ జిల్లా పోలీస్ నియామకాల్లో భాగంగా కేయూ మైదానంలో దేహ దారుఢ్య పరీక్ష నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు అనంతరం రాజేందర్ అనే అభ్యర్థి గుండెపోటుకు గురయ్యాడు. ములుగు జిల్లాకు చెందిన రాజేందర్ కేయూ గ్రౌండ్ లో దేహ దారుఢ్య పరీక్షకు హాజరయ్యాడు. యువకుడిని ఎంజీయం ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పరామర్శించారు. పోలీస్ నియామకాల్లో భాగంగా కేయూ మైదానంలో నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం రాజేందర్ అనే అభ్యర్థి అస్వస్థతకు గురయ్యాడు. అభ్యర్థిని ఎంజీయం ఆసుపత్రికి పోలీస్ అధికారులు తరలించారు. అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అభ్యర్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎంజీఎం చేరుకొని అస్వస్థతకు పొందిన అభ్యర్థికి అందిస్తున్న చికిత్సను పరిశీలించడంతోపాటు అభ్యర్థి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన అభ్యర్థికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులకు సూచించారు.
చలికాలంలో గుండెపోటు ప్రమాదం
వేసవి వచ్చిందంటే టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలు రెచ్చిపోతాయి. ఇక చల్లని చినుకులు మొదలయ్యాయంటే డెంగ్యూ, డయేరియా, హెపటైటిస్ ఎ వంటివి రావడానికి సిద్ధంగా ఉంటాయి. చలికాలంలో అందరూ జలుబు, దగ్గు, జ్వరం, నిమోనియా వంటివే వస్తాయని అనుకుంటారు. కానీ నివురు గప్పిన నిప్పులా గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అందులోనూ ముఖ్యంగా చలికాలంలో తెల్లవారుజామున గుండె పోటు కేసులు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు వైద్యులు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ వైద్యులు. వారు చెప్పిన ప్రకారం ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమైనప్పుడు,గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చలికాలంలోనే ఎందుకు?
ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల కనిపించినప్పుడు గుండె ఆరోగ్యం కూడా దిగజారుతుంది. రక్తపోటు సాధారణంగా లేకుండా హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా, లేక గుండె కొట్టుకునే వేగం పెరిగినా, తగ్గినా మీరు చల్లని వాతావరణంలో బయటికి వెళ్లకూడదు. వెచ్చని ప్రదేశంలో లేదా రెండు మూడు దుప్పట్లు కప్పుకుని శరీరానికి వెచ్చదనం వచ్చేలా చేయాలి. చలికాలంలో పొగమంచు వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వయసులో పెద్దవారు, గుండె సమస్యలు ఉన్నవారు పొగమంచుకు దూరంగా ఉండాలి. చల్లగాలి, చల్లని వాతావరణ లేకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేసవిలో మీరు తాగే నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. కానీ చలికాలంలో అధికంగా నీరు తాగడం వల్ల గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది.చల్లని వాతావరణంలో చెమట పట్టదు. దీంతో ద్రవాలు ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండిపోతాయి. దీని వల్ల శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఈ పరిస్థితి చివరికి గుండెకు చేటు చేస్తుంది.