(Source: ECI/ABP News/ABP Majha)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు అరెస్టుకు వారెంట్ జారీ
Telangana News: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసుల పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Arrest Warrant Against SIB Ex Chief Prabhakar Rao in Phone Tapping Case: తెలంగాణలో సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు (SIB Ex Chief Prabhakar Rao).. నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై సీఆర్పీసీ 73 సెక్షన్ కింద అరెస్ట్ వారంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకూ నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీస్ విచారణలో వీరు చెప్పిన వివరాల ఆధారంగా.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు కీలక సూత్రధారి అని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే, కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం ప్రభాకరరావు ఎక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగినా పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. అనంతరం సీఆర్పీసీ 73 ద్వారా అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు.
'నేనూ కేసీఆర్ బాధితుడినే'
అయితే, తానూ కేసీఆర్ బాధితుడినే అంటూ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతోనే నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకరరావు.. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు.
Also Read: Navneet Kaur Rana: ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు - ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు