అన్వేషించండి

Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !

Telangana : కొండా సురేఖపై వేసిన పిటిషన్‌లో నాగార్జున మంగళవారం కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. క్షమాపణ చెప్పినా సరే క్రిమినల్ విచారణ జరగాలని ఆయన కోరనున్నారు.

Nagarjuna will testify in the court on Tuesday : కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసులో  నాగార్జున మంగళవారం కోర్టుకు హాజరై తన స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. సోమవారం జరిగిన విచారణ నాగార్జున తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. 

కొండా సురేఖ రూ. వంద కోట్లు కట్టాల్సిందేనంటున్న  నాగార్జున 

నాగార్జున కుటుంబంపై  తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేయకుండా ఉండాలంటే సమంతను పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని దానికి నాగార్జున అంగీకరిచినా సమంత అంగీకరించకుండా విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఆ విదంగా నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం అని ఆరోపించారు. మొత్తంగా ఆమె కేటీఆర్‌ను టార్గెట్ చేయాలనుకున్నప్పటికీ అది గురి తప్పి నాగార్జున కుటుంబంపై బాంబులా పడింది. ఇవి పరువు తక్కువ ఆరోపణలు కావడంతో నాగార్జున మొదట క్షమాపణలు చెప్పాలని పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత మనసు మార్చుకున్నారు.  రూ. వంద కోట్లకు కేసు వేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ- తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఖాయమా!

సమంతకు సారీ చెప్పిన సురేఖ - నాగార్జున విషయంలో సైలెంట్ 

తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పినా వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరో వైపు చిత్ర పరిశ్రమ తీరుపై టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెక్కి తీసుకున్నా ఎందుకు ఇష్యూ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పై ఓ కేసు కూడా నమోదయింది. తుమ్మిడి కంటను కబ్జా చేసి కట్టిన కన్వెన్షన్ వల్ల పెద్ద మొత్తంలో సంపాదించారని క్రిమినల్ కేసులు పెట్టి ఆ మొత్తం రికవరీ చేయాలని కేసు పెట్టారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read:ఉపయోగించని క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా - ఏది మంచిది? 

నాగార్జునపై కేసు నమోదు  కావడంతో ఆయన నెనక్కి తగ్గుతారమో అని అని ఎక్కువ మంది అనకుంటున్నారు. అయితే కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారని కూడా... తమకు చెప్పలేది కొన్ని మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో నాగార్జున వ్యాఖ్యానించారు. కొండా సురేఖ కూడా సమంతకు తన విచారాన్ని వ్యక్తం చేశారు కానీ.. నాగార్జున కుటుంబం విషయంలో వెనక్కి తగ్గలేదు.  ప్రస్తుతానికి రెండు వైపుల నుంచి ఈ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదు కానీ.. నాగార్జున మాత్రం న్యాయపరమైన చర్యల విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.             

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Zomato CEO Deepinder Goyal :  అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
Singham Again Trailer: ఇది పోలీసు రామాయణం - సగం బాలీవుడ్ ఇందులోనే - ఐదు నిమిషాల ట్రైలరా?
ఇది పోలీసు రామాయణం - సగం బాలీవుడ్ ఇందులోనే - ఐదు నిమిషాల ట్రైలరా?
Telangana News: టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ- తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఖాయమా!
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ- తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఖాయమా!
Embed widget