అన్వేషించండి

Mulugu Crime : ములుగు జిల్లాలో హైటెక్ దొంగలు, బంగారం కొట్టేసి బ్యాంక్ తనఖా పెట్టేశారు!

Mulugu Crime : మారుమూల ప్రాంతాల్లో దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సినీ ఫక్కీలో హంగామా చేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

Mulugu Crime : ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు నెలలో మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక గాంధీ నాయక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై కప్పు పెంకులు తీసి ఇంట్లోకి వెళ్లారు. స్క్రూ డ్రైవర్ సాయంతో బీరువాను తెరచి అందులో ఉన్న 9 తులాల బంగారాన్ని అదే గ్రామానికి చెందిన  వాంకుడోత్ వినోద్ కుమార్, పాడ్య చరణ్ కుమార్ అనే  ఇద్దరు యువకులు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగ తనానికి పాల్పడిన యువకుల్ని పట్టుకున్నారు. యువకుల్ని విచారించి వారి వద్ద నుంచి 5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గోల్డ్ లోన్ 

 మిగతా బంగారాన్ని ప్రైవేట్ సంస్థలో గోల్డ్ లోన్ కింద తాకట్టు పెట్టారు నిందితులు. రికవరీ చేసిన బంగారాన్ని పోలీసులు మీడియా ముందు ఉంచారు. గ్రామాల్లో ఎవ్వరైనా అనుమానంగా సంచరిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ఇద్దరు అరెస్టు 
 
"మదనపల్లి గ్రామానికి ఓ వ్యక్తి తన తల్లి ఆరోగ్యం బాగాలేదని హన్మకొండ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. ఈ కేసును దర్యాపు చేసి ఇద్దరిని అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. అయితే మిగిలిన బంగారాన్ని నిందితులు బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ డబ్బులను అవసరాలకు వాడుకున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టులో హాజరుపరుస్తాం"- మేకల రంజీత్ కుమార్ సీఐ 

బస్సుల్లో జర్నీ చేస్తున్నారా? బీ అలెర్ట్ 

హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల నుంచి వేర్వేరు ఊళ్లకు వెళ్లే బస్సులు భోజనాలు, టిఫెన్‌ చేయడానికి సిటీ దాటిన తర్వాత ఆపడం సర్వసాధారణం. అందులో చాలా మంది రెస్ట్‌రూమ్‌కని, భోజనం చేద్దామని దిగుతూ ఉంటారు. అలాంటి వాళ్లంతా అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. భోజనాలకు, రెస్ట్ కోసం ఇలా బస్‌ ఆపారో లేదో...  చాలా మంది హడావుడిగా దిగి వెళ్లిపోతుంటారు. అయితే ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని ఓ ముఠా చెలరేగిపోయింది. అంతా బస్‌ దిగిన తర్వాత బ్యాగ్‌లను వెతికి మరీ విలువైన వస్తువులను కొట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే ముఠా ఇది. అందరిలాగానే ఎక్కడికో ఒక చోటకు టికెట్ తీసుకుంటారు. మధ్యలో బస్ ఆగిన వెంటనే చేతికి పని చెప్పి... జారుకుంటారు. మరికొందరు బస్‌లు ఎక్కువ ఆగి... ఎక్కువ ప్రయాణికులు ఉండే దాబాలు, హోటల్స్ వద్దే రెక్కీ వేస్తుంటారు. ఇలాంటి కన్నింగ్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

టిఫిన్ కోసం ఆపితే అంతే 

నార్కెట్ పల్లి శివారులోని ఓదాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వాళ్లను పట్టుకొని విచారిస్తే వాళ్లు చేసిన కంత్రీ పనుల చిట్టా విప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాజ్, సర్ఫరాజ్ ఈ ముఠాను లీడ్ చేశారు. పదిహేను ఏళ్ల నుంచి యూపీతోపాటు బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌, గుంటూరు బస్‌స్టాండ్‌లలో చేతికి పని చెప్పారు. ప్రయాణీకుల బ్యాగ్‌ల నుంచి డబ్బులు, బంగారం మాయం చేసి ఎస్కేప్ అవుతారు. తాజ్, సర్ఫరాజ్ కలిసి తెలంగాణలో నల్లగొండ, నార్కెట్‌పల్లి, కోదాడ, షాద్‌నగర్, హైదరాబాద్ పరిధిలలో కూడా దొంగతనాలు చేశారు. ఇద్దరూ 9 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించినారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బంధువులను కలుపుకొని ఓ ముఠాగా ఏర్పడ్డారు.  తొమ్మిదో నెల ఏడో తేదీన నార్కెట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద బస్సు టిఫిన్ కోసం ఆపగా బస్ లాగేజి స్టాండ్‌లో ఉన్న 30 లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తేశారు. దీంతో బాధితులు హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కేసు నమోదు చేశారు. విచారణ కోసం ఆ కేసును నార్కెట్‌పల్లికి తరలించారు పోలీసులు.  ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే.. పోలీసులకు అనుమానితులు తిరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. వారిని అరెస్టు చేసి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది.  
 


 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Breaking News: NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget