అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌ పురుషుల్లో ఈ సమస్య అధికం- నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సంచలన రిపోర్ట్‌

NCRB Report: మగాడు.. మనసులో ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా.. అన్నింటిని మౌనంగా భరిస్తూ పైకి నవ్వుతూ కపిస్తూ ఉంటాడు. బాధ్యతలు, బరువులు మోస్తూ సమాజంలో కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. 

Mens Suicide In Hyderabad: మగాడు.. మనసులో ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా.. అన్నింటిని మౌనంగా భరిస్తూ పైకి నవ్వుతూ కపిస్తూ ఉంటాడు. బాధ్యతలు, బరువులు మోస్తూ సమాజంలో కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. మేరుమగధీరడుగా పిలిపించుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొంటూ పైకి గంభీరంగా కనిపిస్తాడు. కానీ అలా కనిపించడానికి లోలోన నలిగిపోతుంటాడు. వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (National Crime Records Bureau)– 2022 గణాంకాలు పురుషుల ఆత్మహత్యల (Mens Suicides) గురించి సంచలన విషయాన్ని బయటపెట్టాయి. 

జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కొన్ని సార్లు కష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ముఖ్యంగా సిటీలో  నమోదైన ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. బాధ్యతలు, బరువులు, ఒత్తిడి, విరక్తి ఎక్కువగా ఉండడం, కొన్ని సార్లు మనోనిబ్బరం బలహీనంగా ఉండడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌ (Hyderabad)లో 2022లో మొత్తం 544 ఆత్మహత్య జరిగాయి. ఇందులో పురుషులు ఏకంగా 433 మంది ఉన్నారు. 111 మంది మహిళలు ఉన్నట్లు మంగళవారం విడుదలైన ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాల్లో తేలింది. మొత్తం ఆత్మహత్యల్లో పురుషులు దాదాపు 80 శాతం ఉన్నట్లు వెల్లడైంది. అంతే కాదు ఆత్మహత్యల సంఖ్యలో దేశంలో హైదరాబాద్‌ పదో స్థానంలో ఉంది.  కష్ట, నష్టాలను సులువుగా ఎదుర్కొనే పరుషులు కొన్ని సార్లు నిరాశ, నిస్పృహలతో క్షణిక కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఎంత మంది అంటే
దేశ వ్యాప్తంగా గత ఏడాది 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి కేవలం రికార్డులకెక్కినవి మాత్రమే. రికార్డుల్లో చేరనివి ఇంతకు మించే ఉంటాయని అంచనా. అధికారికి గణాంకాల ప్రకారం 9,980 బలన్మరణాలు రాష్ట్రంలో జరిగాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీ 3367 ఆత్మహత్యలతో ప్రథమ స్థానంలో ఉంది. బెంగళూరు (2313) ద్వితీయ స్థానంలో ఉండగా, సూరత్‌ (1004) మూడో స్థానంలో ఉంది. 

మహిళల కంటే నాలుగు రెట్లు అధికం
హైదరాబాద్ విషయానికి వస్తే 544 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో పురుషులు 433, మహిళలు 111 మంది ఉన్నారు. మహిళల కంటే పురుషులు 4 రెట్ల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు కారణాలుగా నిలుస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలు జరుగుతున్నాయని, ఇందులో కుటుంబ కలహాలతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవే కారణాలు..
గత ఏడాది సిటీలో జరిగిన ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడం వంటి కారణాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాల కారణంగా  ముగ్గురు పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో 120 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 87 మంది పురుషులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్‌ చేసుకోగా వీరిలో మగవారు 100 మంది ఉన్నారు. 

సన్నిహితులు చనిపోయారనే కారణంతో ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులు ఎక్కువ ఉన్నారు. ప్రేమ కోసం గత ఏడాది ఏడుగురు బలన్మరణం చెందారు. నిరుద్యోగం సైతం మగాళ్ల చావుకు కారణమవుతోంది. 13 మంది పురుషులు ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు ఏమన్నారంటే..
ఆత్మహత్యల గురించి పోలీసులు స్పందిస్తూ.. రాష్ట్ర పోలీసులు ఇచ్చే జాబితా ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ నివేదిక రూపొందిస్తుందన్నారు. చాలా ఆత్మహత్యలకు అసలు కారణాలు వెలుగులోకి రావని, కొన్ని ఉదంతాలు అసలు పోలీసు రికార్డుల్లోకే ఎక్కవని వెల్లడించారు. కుటుంబ వ్యవహారాలు, విఫల ప్రేమలు, వివాహేతర సంబంధాలతో జరిగిన బలన్మరణాలు బయటకు రాకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget