By: ABP Desam | Updated at : 06 May 2022 02:36 PM (IST)
ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud Press Meet: తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరును విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఉద్దేశించి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎన్నికలు వస్తుంటే యాత్రలు మొదలయ్యాయని, మతం కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతంపై వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘2000 లో మూడు రాష్ట్రాలు ఇచ్చినపుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి బీజేపీ కట్టబెట్టింది. సిగ్గు శరం లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారు. సంజయ్ నత్తితో మాట్లాడుతున్నారు. ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు. సంజయ్ ఓ బద్మాష్, వీధి రౌడీ లా మాట్లాడుతున్నారు. సంజయ్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన వాడేవడో. సీఎం, మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావా? నువ్వు ఎవరివి.. నీకెవరు సంస్కారం నేర్పారు. నీ ఇంట్లో నుంచి ఏమన్నా గుంజుకున్నమా?
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇపుడున్న సీట్లు కూడా రావు. అదృష్టంలో గెలిచి ఎంపీ అయ్యారు. సంజయ్ తీరుని చూసి బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో దత్తాత్రేయ లాంటి నేతలు బీజేపీలో సంస్కారవంతంగా ఉన్నారు. సంజయ్.. పిచ్చిగా మాట్లాడటం ఆపకపోతే నాలుక చీరేస్తాం..
కాళేశ్వరం టీఆర్ఎస్‌కు ఏటీఎం అంటున్నారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి బీజేపీకి అవన్నీ ఏటీఎంలా? బీజేపీ దేశం పాలిట ఏటీఎం అయింది. ఏటీఎం అంటే అమ్మేయడం, తాకట్టు పెట్టడం, మోదెయ్యడం. ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ. ఏటీఎం అంటే ఆదానీ తొత్తు మోదీ. తెలంగాణలో రెండు ఉపఎన్నికల్లో గెలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో కమలం వాడిపోవడమే తప్ప వికసించడం ఉండదు.
‘‘సంజయ్ కు మెంటల్ ఎక్కింది.. తక్షణమే పిచ్చాస్పత్రిలో చేర్చాలి. దమ్ముంటే ఆరోపణలు చేయడం కాదు నిరూపించు. పదేళ్ల పేపర్లు తిరగేయ్ నేను తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర పోషించానో తెలుస్తుంది. కేసీఆర్ పులి లాంటోడు.. బీజేపీ పులి తోకను గిల్లుతోంది.. పులిని గిల్లితే ఏమవుతుంది? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా కేసీఆర్ కు తెలంగాణ అన్న పంచ ప్రాణాలు. కేసీఆర్‌ను ఎవ్వరూ ఓడించలేరు’’ అని వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు.
Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్
Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు
Vande Bharat Express: ఈనెల 24వ తేదీన కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ రైలు ప్రారంభం
బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి
Teacher Transfers - 2023: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మళ్లీ బ్రేక్ - హైకోర్టు 'స్టే'తో 13 జిల్లాల్లో నిలిచిపోయిన బదిలీలు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
AP Assembly Sessions 2023: దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్- అదే స్థాయిలో రియాక్ట్ అయిన బాలకృష్ణ- సభ వాయిదా
కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
ఖలిస్థాన్ వేర్పాటువాదం వెనక పాకిస్థాన్! సంచలన విషయం చెప్పిన నిఘా వర్గాలు
/body>