అన్వేషించండి

Tummala Nageswararao: 'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Telangana News: రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

Minister Tummala Announcement on Loan Waiver: రాష్ట్రంలో సంక్షోభం నుంచి సంక్షేమంలోకి వెళ్తున్నామని.. వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) తెలిపారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ.. రైతుల శ్రేయస్సుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. ఇందు కోసం ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అలాగే, 2023 - 24 యాసంగికి సంబంధించి ఇప్పటివరకూ 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. 92.68 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పై విమర్శలు

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల విమర్శలు గుప్పించారు. 'గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదు. 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజులు, యాసంగిలో 5 నెలల 11 రోజులు, అలాగే 2019 - 20 వానాకాలంలో 4 నెలల 10 రోజులు, యాసంగిలో నెల 19 రోజులు, 2020 - 21 వానాకాలంలో 5 నెలల 16 రోజులు, యాసంగిలో 2 నెలల 24 రోజులు, 2022 - 23 వానాకాలంలో 2 నెలల 8 రోజులు, యాసంగిలో 4 నెలల 28 రోజులు, 2023 - 24 వానాకాలంలో 3 నెలల 20 రోజులు పట్టింది.' అని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ పంట పొలాలు సందర్శించలేదని.. కానీ, ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను రాజకీయం చేయడం తగదని.. అది బీఆర్ఎస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.

Also Read: Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget