By: ABP Desam | Updated at : 08 May 2022 05:37 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
Twitter AskKTR : ఆదివారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు చెప్పారు. హైదరాబాద్ లో ఐపీఎస్ మ్యాచ్ లు ఎందుకు నిర్వహించడంలేదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గంగూలీ, జై షా సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. కర్నాటకలో సీఎం పదవి అమ్మకంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ నిజస్వరూపానికి ఇది నిదర్శనమన్నారు.
Real face of BJP https://t.co/ztN2MQPKS6
— KTR (@KTRTRS) May 8, 2022
ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్
ఇప్పుడు #AskKTR టాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ ఉంది. మంత్రి కేటీఆర్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్విట్టర్ వేదికగా కొనసాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణ అంశాలతో పాటు దేశంలో సమకాలీన విషయాలపై నెటిజెన్లు మంత్రి కేటీఆర్ ప్రశ్నలు అడిగారు. ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్‌లో #AskKTR టాప్‌లో కొనసాగుతోంది. సాధారణ నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు సైతం కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు.
#ProudFather https://t.co/gdYBnwJraz
— KTR (@KTRTRS) May 8, 2022
బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రశ్నలు
కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నల్లోనే కొందరు ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణక్యం ఠాగూర్, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా పలువురు కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. 2014 నుంచి 2018 మధ్య రూ. 7 కోట్లు నుంచి రూ.41 కోట్లు పెరిగాయి. నాలుగేళ్లలో 400 శాతం మేర ఆస్తులు పెరిగాయి ఆ సీక్రెట్ ఏమిటో కాస్త చెప్పండని ఆడిగారు. 2018 నుంచి 2023 వరకు ఎంత పెరగొచ్చో చెప్పండని మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేత అర్వింద్ స్పందిస్తూ పీఎం ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ప్రభుత్వం తన వాటాను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. నాగరాజుకు పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు. క్రెకెట్, సినిమాల గురించి కేటీఆర్‌ను అనేక మంది ప్రశ్నించారు.
Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ
KTR TODAY : సద్గురు " సేవ్ సాయిల్" ఉద్యమానికి కేటీఆర్ సపోర్ట్ - దావోస్‌లో కీలక చర్చలు !
Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ ఏమన్నారంటే?
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!