అన్వేషించండి

Medigadda barriage: 'మేడిగడ్డ'పై నిపుణులతో కమిటీ - కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం

Medigadda Barrage News: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ ఆరుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. వంతెనను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Medigadda Barrage News: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో ఈ కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మంగళవారం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. కుంగిన ఫిల్లర్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. దీనిపై పూర్తి నివేదికను నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది.

ఇదీ జరిగింది

కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద శనివారం ఒక్కసారిగా కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

ప్రతిపక్షాల విమర్శలు

మరోవైపు, వంతెన కుంగడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఫిల్లర్ కుంగిపోవడానికి సీఎం కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి ఆ కుటుంబమేనన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై, కేంద్ర హోం మంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అటు, బీజేపీ నేతలు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోనే కేసీఆర్ అవినీతి బయట పడిందని బీజేపీ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2016 మే 2న చేపట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్అండ్ టీ సంస్థే దీన్ని నిర్మించింది. నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబర్ ఫిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పనులు పూర్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. వంతెన కుంగిన విషయాన్ని మహారాష్ట్రకు వెళ్తున్న వాహనదారులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు అప్రమత్తమై రాకపోకలు నిలిపేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget