YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila : వైఎస్ షర్మిల మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ ను కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడించిందన్నారు.
YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. తన తండ్రి వైఎస్ఆర్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదన్నారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ అధికారంలోకి తెచ్చారన్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, ఎలా చనిపోయారో కనీసం దర్యాప్తు కూడా చేయించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ ఫొటోతో కాంగ్రెస్ ఓట్లు ఎలా అడుగుతుందని నిలదీసారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం వైఎస్ షర్మిల పాదయాత్రలో చేస్తున్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 167వ రోజు నర్సాపూర్ నియోజకవర్గం తులిజరావుపేటలో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆవంచ, మంగాపూర్, దౌల్తాబాద్, దేవలపల్లి, హత్నూర్ మీదుగా సాగుతోంది. సాయంత్రం హత్నూర్ మండలం కోనియల్ గ్రామంలో ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోబోతున్నా. pic.twitter.com/exa8dKHoJN
— YS Sharmila (@realyssharmila) September 29, 2022
ఎఫ్ఐఆర్ లో పేరు చేరుస్తారా?
"వైఎస్ఆర్ కు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్ల కష్టపడ్డారు. లాస్ట్ లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 2009లో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించి రెండు సార్లు అధికారం ఇచ్చారు. కేంద్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అలాంటి కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఏంచేసింది. వైఎస్ఆర్ దోషి అని ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది. మరి రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. రాజశేఖర్ రెడ్డిని మోసంచేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోతే కనీసం దర్యాప్తు చేశారా? రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ పట్ల కనీసం కృతజ్ఞత ఉందా ఈ కాంగ్రెస్ పార్టీకి. బతికున్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అని పొడిడారే, చనిపోతే అలాంటి మనిషిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తారా? "- వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ వల్లే కాంగ్రెస్ కు ఖ్యాతి
"మళ్లీ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందా? సిగ్గుండాలి. రాజశేఖర్ రెడ్డి బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖ్యాతిని తెచ్చారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఖ్యాతి తేలేదు. వైఎస్ఆర్ చనిపోయాక ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏంచేయగలిగింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. " -వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ మరణంపై
వైఎస్ షర్మిల ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని ఇటీవల వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని అన్నారు. తనకు బేడీలు అంటే భయం లేదని, చేతనైతే తనను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. తాను బతికి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడడం ఆపడం, తన గొంతు ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు.
Also Read : BJP MP Laxman : అభివృద్ధి లేని రాష్ట్రం ఏపీ, మూడు రాజధానుల పేరుతో మభ్యపెడుతున్నారు- ఎంపీ లక్ష్మణ్
Also Read : Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !