అన్వేషించండి

Tirupati Reddy Joins BRS: బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

Kantareddy Tirupati Reddy Joins BRS:

ఓవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు ఇతర పార్టీలకు వలస పోతుంటే, ప్రతిపక్ష పార్టీలో భంగపడిన నేతలు అధికార పార్టీకి క్యూ కట్టారు. ఇదివరకే మల్కాజిగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడం తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి  వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

డీసీసీ అధ్యక్షుడిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు తన కొడుకుకు మెదక్ జిల్లా టికెట్ అడగడంతో కాంగ్రెస్ పార్టీకి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. ఎందుకంటే తిరుపతి రెడ్డి మెదక్ నుంచే టికెట్ ఆశిస్తు్న్నారు. 

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వివేకానంద నగర్ లోని కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, సునీత లక్ష్మారెడ్డి గురువారం (అక్టోబర్ 5న) వెళ్లారు. కంఠా తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయన మంచి నాయకుడని హరీశ్ రావు కొనియాడారు. చాలా ఏళ్లుగా మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని హరీశ్‌ రావు ఆరోపించారు. పైసలకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. నమ్ముకున్న వారిని మోసగిస్తుందని అన్నారు. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్‌ కోసం రిఫ్రెష్ చేయండి)

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget