News
News
వీడియోలు ఆటలు
X

Mancherial Murder: మంచిర్యాల లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు! వీడియో కాల్స్ బయటికి

పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు కీలక వివరాలు తెలిశాయి. మహేష్, నిందితురాలైన యువతి మధ్య ఫోన్ వీడియో కాల్స్ బయటికి వచ్చాయి.

FOLLOW US: 
Share:

మంచిర్యాలలో జరిగిన లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో హతుడైన మహేశ్ అనే వ్యక్తిని యువతి, ఆమె కుటుంబ సభ్యులు కత్తితో పొడిచి, బండదో పదే పదే తలపై మోది హత్య చేసిన సంగతి తెలిసిందే. వీరి ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు కీలక వివరాలు తెలిశాయి. మహేష్, నిందితురాలైన యువతి మధ్య ఫోన్ వీడియో కాల్స్ బయటికి వచ్చాయి. ఆ వీడియో కాల్స్ ని బట్టి చూస్తే పెళ్లి జరిగిన తర్వాత కూడా మహేశ్, శ్రుతి ప్రేమికులుగా కొనసాగినట్లుగా తెలుస్తోంది. 

గతేడాది మే 21న మహేశ్ ప్రియురాలికి మరో యువకుడితో పెళ్లి జరగ్గా, ఆ తర్వాత కూడా ఆమె మహేశ్ తో ఫోన్ లో మాట్లాడుతూ వచ్చింది. శ్రుతి భర్తకు ఆ వీడియో కాల్స్, కొన్ని న్యూడ్ వీడియోలు చేరాయని, అవి చూసి భర్త మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.

బయటికి వచ్చిన వీడియో కాల్స్‌లో యువతి మహేశ్ తో ఏడుస్తూ మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లుగా హ్యాపీగా ఉన్నాం కదా.. ఈ ఐదేళ్లు నువ్వు నేను చెప్పిన మాటే విన్నావు కదా.. హార్ట్ ఫుల్ గా చెప్పు. ఇంకో రెండేళ్లు కన్‌సీవ్ అయ్యే వరకూ నేను చెప్పినట్లు విను. ఇది నేను ప్రామిస్ చేసి చెప్తున్నా.. సాయిరాం మీద ఒట్టేస్తున్నా. నేను నీకు అన్యాయం చెయ్యను. ఫేస్ టు ఫేస్ చెప్తున్నా’’ అని యువతి ఏడుస్తూ మాట్లాడుతుండగా అదే వీడియో కాల్ మహేశ్ ఏడవొద్దని ఓదారుస్తున్నాడు.

అయితే, ఆ వీడియోలు ప్రియురాలి భర్తకు మహేశే పంపాడని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావించి ఆమెతో పాటు కుటుంబ సభ్యులు మహేశ్ ను చంపినట్లుగా భావిస్తున్నారు. 

అసలేం జరిగింది?  

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెడుతున్న కారణంగా ఓ యువకుడిని ఆ యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ముషిక మహేష్ (28) అనే యువకుడు బండిలో పెట్రోల్ పోయించుకుని వస్తున్న క్రమంలో ఓ కుటుంబం అతణ్ని అడ్డగించింది. ఇద్దరు అతణ్ని గట్టిగా పట్టుకోగా, మరో ఇద్దరు మేకలు కోసే కత్తులతో గొంతు కోసి బండరాయితో మోది చంపేశారు. ఏదో గొడవ జరుగుతుందని చుట్టుపక్కల ఇళ్ల వారు అందరూ రోడ్డుపైకి వచ్చి, కొంత మంది ప్రహరీ గోడ నుంచి తొంగి చూస్తూ ఉన్నారు. వారందరి సమక్షంలోనే అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అయినా ఆ హత్యను ఆపడానికి  ఎవరూ కూడా ముందుకు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది.

సాధారణంగా అపరిచిత వ్యక్తి దాడి చేస్తున్న క్రమంలో ఎవరూ ముందుకు రాని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పక్కనే ఉంటున్నవారిని ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా కత్తితో పొడవడం, బండరాయితో కొట్టి, కొట్టి చంపుతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Published at : 26 Apr 2023 12:24 PM (IST) Tags: Video Calls Mancherial Live Murder Mahesh Murder case Mancherial case update

సంబంధిత కథనాలు

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

Odisha Train Accident:  ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్