అన్వేషించండి

Telangana Left Parties : కేసీఆర్ మిత్రధర్మం మరిచారు - కమ్యూనిస్టు పార్టీల ఆగ్రహం !

కేసీఆర్ మోసం చేశారని కమ్యూనిస్టు పార్టీల నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో మోసం చేసేవాళ్లు.. మోసపోయే వాళ్లు ఉంటారంటున్నారు.


Telangana Left Parties :  బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మిత్ర ధ‌ర్మం మ‌రిచి మోసం చేశార‌ని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రెండు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  తెలంగాణ  సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  రాజ‌కీయాల‌లో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు .  మునుగోడులో బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతిచ్చామన్నారు. కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలన్నారు. మునుగోడులో మద్దతివ్వడం తమ తప్పు కాదన్నారు. కేసీఆర్‌ను తాము నమ్మడం కాదని, ఆయన తమను అవసరానికి వాడుకున్నార‌ని తీవ్ర విమర్శలు చేసారు. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేద్దామని  కేసీఆర్ తమతో రెండుమూడుసార్లు మాట్లాడారని, కానీ సీట్ల ప్రకటన సమయంలో తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. బిఆర్ ఎస్ తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతున్నారు.  సీపీఎం, సీపీఐ.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.  తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమని..లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.  సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల‌లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  వామ‌ప‌క్షాల‌కు స‌గంపైగా సీట్ల‌లో ప్ర‌భావం చూపే ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. 
 
మునుగోడు  ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో కేసీఆర్ పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో  కమ్యూనిస్టు నేతల్ని ప్రగతి భవన్‌కు  పిలిపించి చర్చలు జరిపారు. కమ్యూనిస్టుపార్టీల జాతీయ నేతల్ని కూడా ప్రగతి భవన్‌కు  పిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో..  కమ్యూనిస్టులతో బంధం ఈ ఒక్క ఉపఎన్నికతో ఆగని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు కనీ సం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 

మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు  వద్దని కేసీఆర్ అనుకున్నారని జాబితాను బట్టి స్పష్టయింది.   మునుగోడు ఉప ఎన్నికల్లో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్‌ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. అయితే  సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే.. చెరో రెండు, మూడు సీట్లు అయినా ఇవ్వాల్సి వస్తుందని..  ఆ సీట్లు త్యాగం చేయడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ చేతిలో మోసపోయామని మండిపడుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Embed widget