అన్వేషించండి

KTR Comments: రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుంది- మరోసారి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

KTR : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్లుగా తెలంగాణ పరిస్థితి తయారయిందన్నారు.

KTR harsh comments against CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆయన రాజకీయ ప్రయాణం , పాలనపై కేటీఆర్   ఘాటు వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన కొంత మంది నేతలు పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 
 
పేగులు మెడలో వేసుకోవడం, గుడ్లు పీకి గోటీలాడటం వంటి మాటలు ఒక ముఖ్యమంత్రికి తగునా అని ప్రశ్నించారు. తనకు కూడా ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టడం వచ్చని, కానీ ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని బట్టి సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన నాయకుడు, తన తండ్రి అయిన కేసీఆర్‌ను తిడితే ఒక కొడుకుగా ఆవేశం రావడం సహజమని, రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుందని, కానీ ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఆగుతున్నామని మండిపడ్డారు.

గతంలో రేవంత్ రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేవాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏ వ్యక్తి అయినా కష్టపడి పైకి రావడం తప్పులేదని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దొంగ పనులు, లంగా పనులు చేసి, ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లారని విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి సంతోషం ఉండాలి కానీ, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడిగితే ఏడుపు మొహం పెట్టి ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసరడంపై కేటీఆర్ స్పందిచారు.  కేసీఆర్ గారు బయటకు వచ్చి కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టి చలిజ్వరం వచ్చింది. ఇక ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగి చస్తాడు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్లుగా నేడు తెలంగాణ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.           

తన విద్యాభ్యాసంపై రేవంత్ చేసిన విమర్శలను కూడా కేటీఆర్ తిప్పికొట్టారు. తాను గుంటూరులో ఇంటర్ చదివితే రేవంత్ కు ఎందుకు నొప్పని, తాను ప్రపంచమంతా చదువుకున్నానని చెప్పారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పని అంటున్న రేవంత్, ఆంధ్రా నుంచి అల్లుణ్ణి తెచ్చుకోవచ్చు కానీ తప్పులేదా అని ప్రశ్నించారు. రేవంత్‌ను ఇకపై  చిట్టి నాయుడు అనడమే కాకుండా  భీమవరం బుల్లోడు అని పిలవాలన్నారు.   తన తండ్రి పేరు చెప్పుకోవడంలో గర్వపడుతున్నానని, తెలంగాణ తెచ్చిన మొనగాడు కాబట్టే బరాబర్ పేరు చెప్పుకుంటానని, రేవంత్ కూడా మంచి పనులు చేస్తే ఆయన పిల్లలు పేరు చెప్పుకుంటారని, లేదంటే మనవడు కూడా పేరు చెప్పుకోడన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget