KTR On Oscar : హక్కులు గురించి మాట్లాడరు.. చెప్పులు మోస్తారు - తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ !
తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ న్యాయపరమైన హక్కుల గురించి మాట్లాడేవారే లేరన్నారు.
KTR On Oscar : తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. న్యాయమైన హక్కుల గురించి డిమాండ్ చేసే బీజేపీ నేతలు తెలంగాణలో ఒక్కరు కూడా లేరని ఆయన ఆరోపించారు.బీజేపీ నేతలు గుజరాతీ బాస్‌ల చెప్పులను మోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ తెలంగాణకు అందాల్సిన హక్కుల గురించి డిమాండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. మోడీవర్స్‌కు గుజరాత్ కేంద్ర బిందువుగా మారిందని కేటీఆర్ తన ట్వీట్‌లో విమర్శించారు.
Not a single BJP joker from Telangana has the guts to demand what is rightfully ours
— KTR (@KTRTRS) September 22, 2022
Ever Ready to carry Chappals of their Gujarati Bosses but can’t summon the courage to demand Telangana’s rights
Gujarat is the epicentre of Modiverse https://t.co/zlSLvndhJZ
ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా చేతిలో ఆర్‌ఆర్‌ఆర్ ఓడిపోయిందని, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, కానీ గుజరాత్‌కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, హైదరాబాద్‌కు రావాల్సిన డబ్ల్యూహెచ్‌వో సెంటర్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు పోటీగా గుజరాత్‌లో సెంటర్‌ను ఓపెన్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
Our RRR lost to Gujarati film Chhello Show in the race for oscar. Our Kazipet denied coach factory. Gujarat gets a locomotive factory. Our Hyderabad lost WHO centre to Jamnagar in Gujarat. Our Hyderabad International arbitration tribunal gets a competitor in GIFT city in Gujarat.
— Prof. K.Nageshwar (@K_Nageshwar) September 21, 2022
అదే సమయంలో కేంద్రం సొమ్ముతో టీఆర్ఎస్ సోకులు చేస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారో చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నదన్నారు. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పాలని లెక్కలు ట్వీట్ చేశారు.
ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr.Laxman గారు?
— KTR (@KTRTRS) September 22, 2022
తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నది
తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పండి
లెక్కలు తెలుసుకోండి👇 ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి pic.twitter.com/VrShH3nnPh
బీజేపీ నేతలు చేసే రాజకీయ విమర్శలకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు.