KTR : అమెరికాలో ఖమ్మం విద్యార్థిపై కత్తి దాడి - వెంటనే స్పందించిన కేటీఆర్ !
అమెరికాలో కత్తి దాడికి గురైన ఖమ్మం విద్యార్థికి కేటీఆర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో స్పందించారు.
KTR ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్‌పై అమెరికాలో కత్తి దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహాకారాన్ని అందిస్తామన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో వెల్లడించారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తమ టీమ్ టచ్‌లో ఉంటారన్న కేటీఆర్ వారికి కావాల్సిన సహాయం అందిస్తామన్నారు. వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు.
We will do our best to support Varun with the help of Indian embassy and also the Telangana NRI friends
— KTR (@KTRBRS) November 1, 2023
Will have my team @KTRoffice get in touch with the family https://t.co/edV1mP5wez
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్(29) ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.
జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై ఆండ్రాడ్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వరుణ్ కండీషన్ సిరీయస్‌గా ఉందని, అతను బ్రతికే ఛాన్సు కేవలం 5 శాతమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.