అన్వేషించండి

KTR On LRS : ఎల్ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలి - కాంగ్రెస్ అప్పటి డిమాండ్‌ను వెలుగులోకి తెచ్చిన కేటీఆర్ !

KTR On LRS : ఎల్ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఇదే డిమాండ్ చేసిందన్నారు.


KTR demanded to make LRS free  :   ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ ఆర్ ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తో సహా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ సాక్షాలతో సహా మీడియా ముందు ఉంచారు.  

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.   అప్పటి సీఎల్పీ నేత ఇప్పటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని,  రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి డబ్బులను దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తున్నారని కెటిఅర్ మండిపడ్డారు.  ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుందని, మరీ ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా అన్నారు.
 
ఒక ఒకప్పుడు నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అన్న ఉత్తంకుమార్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని తెలిపిన ఉత్తంకుమార్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు లాక్కోవడం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే ఎల్ఆర్ఎస్ అంశం పైన మంత్రి సీతక్క మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడానికే ఎఆర్ఎస్ పెట్టారని మాట్లాడింది, మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమం పైన కోర్టులో కేసు వేసిన మరో మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకున్నారా లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరోసారి ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ కేసు వేస్తారా అనే విషయాన్ని తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీల అన్నింటిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా 20వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా  మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు,  మంత్రుల వైఖరి పైన కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 

ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల ఆరవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరుతూ ప్రతి జిల్లా కలెక్టర్ కి, అర్డీవోలకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ) కార్యాలయం ముందు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కార్యాలయం ముందు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget