అన్వేషించండి

KTR On Jobs : ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ - రేవంత్ చేసింది అదే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Telangana News : ఉద్యోగాలపై రేవంత్ చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. ఆ ఉద్యోగాలన్నీ కేసీఆర్ ఇచ్చారని రేవంత్ కేవలం ఆఫర్ లెటర్లు ఇచ్చారని స్పష్టం చేశారు.

KTR Comments :   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.   32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని రేవంత్ చెప్పుకుంటున్నారని అవన్నీ కేసీఆర్ సర్కార్ భర్తీ చేసినవేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్న  32 వేల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాల‌ను కేటీఆర్ వెల్లడించారు.  ఈ ఉద్యోగాల‌కు రేవంత్ కేవ‌లం నియామ‌క ప‌త్రాలు మాత్ర‌మే అంద‌జేసిన‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

కాంగ్రెస్  అధికారంలోకి 30 వేల ఉద్యోగాలు ఇచ్చాన‌ని రేవంత్ రెడ్డి, మంత్రులు అదే పనిగా ప్రచారం చేసుకుంటున్నారని  మీరు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్త‌వం అయితే ఏ తేదీన నోటిఫికేస‌న్ ఇచ్చారు. రాత‌ప‌రీక్ష ఎప్పుడు నిర్వ‌హించారు. ఫ‌లితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగుల‌కు చెప్పాల‌ని  కేటీఆర్ డిమాండ్ చేశారు.  వారు చెప్పలేరని ఎందుకంటే అవన్నీ కేసీఆర్ హయాలో వచ్చినవేనన్నారు.  ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్ట‌మొచ్చిన‌ట్టు అబ‌ద్దాలు చెబుతున్నారని తేల్చారు.   

గురుకులాల్లో 9,210 టీజీటీ, పీజీటీ పోస్టుల భ‌ర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఆగ‌స్టు 2023లో రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు మాత్రం ఫిబ్ర‌వ‌రి 2024లో విడుద‌ల‌య్యాయన్నారు.  పోలీసు శాఖ‌లో 17,516 ఉద్యోగాల‌కు ఏప్రిల్ 2022లో నోటిఫికేష‌న్ ఇచ్చాం. జూన్ 2023లో రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. అక్టోబ‌ర్ 4, 2023లో ఫ‌లితాలు వ‌చ్చాయి.   ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో భ‌ర్తీ ప్ర‌క్రియ ఆగిపోయింది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కేసీఆర్ హ‌యాంలోనే జ‌రిగింది. రేవంత్ రెడ్డి నియామ‌క ప‌త్రాలు  మాత్రమే ఇచ్చారన్నారు. 5,204 స్టాఫ్ న‌ర్సు ఉద్యోగాల భ‌ర్తీకి డిసెంబ‌ర్ 2022లో నోటిఫికేష‌న్ జారీ చేసి, ఆగ‌స్టు 2, 2023న రాత‌ప‌రీక్ష నిర్వ‌హించాం. డిసెంబ‌ర్ 23, 2023న ఫ‌లితాలు ప్ర‌క‌టించామన్నారు.                                         

587 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల‌కు ఏప్రిల్ 2022లో నోటిఫికేష‌న్ జారీ అయిందని ఏప్రిల్ 2023లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించామని కేటీఆర్ తెలిపారు.  ఆగ‌స్టు 7 2023లో ఫ‌లితాలు ప్ర‌క‌టించాం. కానీ న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల వ‌ల్ల నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌లేక‌పోయాం. పైన పేర్కొన్న ఉద్యోగాల‌కు రేవంత్ కేవ‌లం నియామ‌క ప‌త్రాలు మాత్ర‌మే ఇచ్చారు. 32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసింది మాత్రం కేసీఆర్ అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తొమ్మిదిన్న‌రేండ్ల కాలంలో 1.60 ల‌క్ష‌ల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భ‌ర్తీ చేయ‌గా, 32 వేల ఉద్యోగాలు కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయాయి. ఇవి అవి మొత్తం క‌లుపుకుంటే కేసీఆర్ భ‌ర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ల‌క్షా 92 వేలని లెక్క చెప్పారు.                   

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్స ఎన్నికల పోలింగ్ సందర్భంగా  కాంగ్రెస్ నేతలు తాము ఉద్యోగాలిచ్చామని ప్రచారం చేసుకుంటూండటంతో కేటీఆర్ ఈ వివరాలు వెల్లడించారు.               

టాప్ హెడ్ లైన్స్

NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Embed widget