KTR Birth Day : ప్రజలు బాధల్లో ఉన్నారు పుట్టినరోజు వేడుకలొద్దు - టీఆర్ఎస్ క్యాడర్‌కు కేటీఆర్ పిలుపు !
వర్షాల కారణంగా పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించవద్దని కేేటీఆర్ పార్టీ క్యాడర్‌ను కోరారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
KTR Birth Day : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు కూడా సందేశం పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు జరగడం సమంజసం కాదని ఆయన బావించారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు.
In the wake of incessant rains & floods in Telangana, I've decided to stay away from my birthday celebrations
— KTR (@KTRTRS) July 23, 2022
A sincere appeal to TRS Party leaders, cadre & well wishers: Instead of celebrations, please dedicate your time & resources to help people under #GiftASmile initiative pic.twitter.com/2iqAj2ZExF
భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ పుట్టిన రోజు జూలై 24వ తేదీ ఆదివారం. ఇందు కోసం పార్టీ నేతలు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అయితే వరదల కారణంగా ఈ ఈ సారి సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వాటిని కొనసాగిస్తారు. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్యాడర్ బాధితులకు సహాయ చర్యలు చేపట్టనుంది.
ప్రతీ ఏడాది కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద.. అంబులెన్స్‌లు.. వికలాంగులకు ట్రై స్కూటర్లు వంటివి పంపిణీ చేసేవారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇప్పటికే ఎంపీ రంజిత్ రెడ్డి కేటీఆర్‌కు ప్రత్యేక వీడియోతో ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Wishing an epitome of commitment and integrity, an uplifting spirit, and a source of great inspiration for the younger generations, Hon'ble Minister Shri @KTRTRS Garu a Very Happy Birthday in advance.#HappyBirthdayKTR pic.twitter.com/8pOy1jxRwD
— Dr Ranjith Reddy - TRS (@DrRanjithReddy) July 22, 2022