Telangan News : జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Politics : బీఆర్ఎస్‌కు ఒకటి రెండు చోట్ల కూడా డిపాజిట్లు రావని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ నాలుగో తేదీ తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అవుతుదంన్నారు.
VenkatReddy Fire On Brs : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూ స్తాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద ్లో మీడియాతో మాట్లాడిన ఆయన కవిత జైలు కు వెళ్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయని.. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు,30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డి ని కేటీఆర్ తిడుతున్నాడా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
దర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ది చేసామని చెప్తున్నారని.. ఎయిర్పోట్ , పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేమేమనాలని ప్రశ్నించారు. ఐఎఎస్ లను అందరినీ అందరిని పక్కన పెట్టి నాలుగు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేశారని.. ఉధ్యమకారుడు కేకే మహెందర్ రెడ్డి ని బీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిందే కేటీఆర్ అని మండిపడ్డారు. 12 కుతగ్గకుండా మాకు ఎంపీ లు వస్తాయి..బీఆర్ఎస్ కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అని జోస్యం చెప్పారు. కేంద్రం ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు.
బీఆర్ఎస్ హాయాంలో మద్యం అమ్మాకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదని వైన్ షాపుల పేరు మీద 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని.. దొడ్డు వడ్ల కు ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదన్నారు. వచ్చే నెల 6,7,8 తాను ,శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నామని వివిధ కంపెనీలతో సమావేశాలు నిర్వహించి ప ెట్టుబడులు తీసుకు వస్తామన్నారు.
కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారు..మేము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థుల కు కుదిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఫోర్ లీడర్ అయి నెల రోజులు కానీ వ్యక్తి.. ఆర్టీఐ కింద 70 లెటర్ లు పెట్టాడని.. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఎల్పీ పదవి తీసుకున్నాడు.. ఆయన పేరు చెప్పాలంటేనే తనకు అవమానంగా ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంన్నారు.. రేవంత్ రెడ్డి కి బయపడి కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎల్బీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచన లో ఉన్నారట.కేసీఆర్ కుటుంబం ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటర్ అని కోమటిరెడ్డి సలహా ఇచ్చారు.