అన్వేషించండి

Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!

Khammam News: ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం వందేభారత్ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు రైలుపై రాళ్ల దాడి చేశారు. 

Vadebharat Train: ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శుక్రవారం సాయంత్రం ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన వెంటనే గుర్తు తెలియని ముగ్గురు యువకులు రాళ్లతో కొట్టారు. ఈ దాడిలో రైలు కోచ్ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల్ని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు. 

ఇటీవలే సర్వీసులు ప్రారంభం..!

తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి (జనవరి 15) ప్రారంభం కానుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. సోమవారం (జనవరి 16) నుంచి జరిగే ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.3,170గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే సర్వీసులో విశాఖపట్నానికి ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్‌ రేట్లలో కొంచెం తేడా ఉంది. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అయినా అప్ అండ్‌ డౌన్‌ ట్రైన్‌ టికెట్‌ ధరలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో కలిసిపోయి ఉన్న కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ రైలు ఛైర్‌కారును టికెట్‌ ధర విడివిడిగా ఇలా..

* బేస్‌ ఫేర్‌ రూ.1,207
రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40
సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45 
మొత్తం జీఎస్టీ రూ.65 
రైల్లో ఇచ్చే ఫుడ్‌కి రూ.308 

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందే భారత్‌ రైలు ఛైర్‌కారును టికెట్‌ ధర విడివిడిగా ఇలా..

* బేస్‌ ఛార్జీని రూ.1206
కేటరింగ్‌ ఛార్జీ రూ.364 (ఇక్కడే టికెట్‌ ధరలో రూ.60 తేడా)

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ నడుస్తున్న షెడ్యూల్‌ను బట్టి అందించే ఫుడ్‌లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం ఇచ్చే ఫుడ్ వేరు. రాత్రి ఇచ్చే ఆహారం వేరు. అందుకే టికెట్ ధరల్లో తేడా కనిపిస్తోంది.

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (SC - VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20834

నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
సికింద్రాబాద్          వరంగల్                   రూ.520                    రూ.1,005
సికింద్రాబాద్           ఖమ్మం                    రూ.750                    రూ.1,460
సికింద్రాబాద్        విజయవాడ                  రూ.905                    రూ.1,775
సికింద్రాబాద్      రాజమహేంద్రవరం           రూ.1365                  రూ.2,485
సికింద్రాబాద్‌         విశాఖపట్నం               రూ.1665                   రూ.3,120

* విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ (VSKP - SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833 

నుండి                   వరకు                 ఛార్జీ (చైర్ కార్)         ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
విశాఖపట్నం     రాజమహేంద్రవరం           రూ.625                        రూ.1,215
విశాఖపట్నం          విజయవాడ               రూ.960                        రూ.1,825
విశాఖపట్నం             ఖమ్మం                 రూ.1,115                     రూ.2,130
విశాఖపట్నం            వరంగల్‌                రూ.1,310                     రూ.2,540
విశాఖపట్నం         సికింద్రాబాద్              రూ.1720                       రూ.3,170

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget