By: ABP Desam | Updated at : 07 Mar 2023 06:27 PM (IST)
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు స్పెషల్ న్యూస్
Womens day Telangana : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఆరోగ్య రక్షణకై 'ఆరోగ్య మహిళ' ను తెలంగాణ రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మార్చి 8వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రతీ మంగళవారం ప్రాధమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగు మందులు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపిస్తారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వైద్య పరీక్షలు
తెలంగాణలోని 33 జిల్లాల్లోఅన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సరైన ఆహరం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మోనోపాజ్ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెస్ట్రువల్ సమస్యలు, సుఖ వ్యాధులు, తక్కువ బరువు ఉన్న సమస్యలకు సంబందించిన వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మొత్తం 20 పాథాలజికల్ లాబ్ లలో నిర్వహిస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే అందచేస్తారు.
భారీగా ఖర్చయ్యే వైద్య పరీక్షలు కూడా ఫ్రీ
మహిళలలో క్యాన్సర్ వ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, మహిళలలో క్యాన్సర్ వ్యాధికి నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన లలో 30 ఏళ్ల పైబడ్డ మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేపడుతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మామోగ్రామ్. కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్ స్మియర్ పరీక్షలను నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్, ఎం.ఎం.జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిర్దారిత క్యాన్సర్ మహిళలకు చికిత్స అందిస్తారు.
ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రజా ప్రతినిధులు
రాష్ట్రంలోని మహిళలకు అయిడిన్ లోపం (థైరాయిడ్ ), విటమిన్ డి-3 , బి-12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు. మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కునే మహిళలలకు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా, మోనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతాన లేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ చేపడుతారు. అవసరమున్నవారికి ఆల్ట్రా సౌండ్ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్ చేస్తారు. సుఖ వ్యాధులు, తక్కువ బరువు తదితర సమస్యలకు కూడా వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గాను ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్ డెస్క్లు కియాస్కి లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం , ఆశా వర్కర్ లతో పాటు పేషంట్ కేర్ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!