అన్వేషించండి

Kavitha Case: కవిత కేసు మార్చి 13కి వాయిదా - సమయం లేదని విచారణ చేపట్టని సుప్రీంకోర్టు !

upreme Court : సుప్రీంకోర్టులో కవిత కేసు మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. సమయం లేకపోవడంతో నేడు ధర్మాసనం విచారణ జరపలేదు.

Kavitha case was adjourned to March 13 in the Supreme Court  :    సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు వచ్చేనెల 13కి వాయిదాపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. సమయం లేకపోవడంతో నేడు ధర్మాసనం విచారణ జరపలేదు. విచారణను న్యాయస్థానం మార్చి 13కు వాయిదా వేసింది. తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంను కవిత కోరారు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. 

ఈ స్కామ్ కు సంబంధించి పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆమె తరపు అడ్వొకేట్  వందన సెఘల్  మొత్తం 105 పేజీలతో కూడిన రిట్  పిటిషన్ ను దాఖలు చేశారు. అప్పట్లో  ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, బెంగాల్  సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్  బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసింది.  అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బెల ఎం.త్రివేది, జస్టిస్  పంకజ్ మిత్తల్ తో కూడిన బెంచ్  ముందుకు రాగా... ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది. 

 తాజాగా సీబీఐ నోటీసుల నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది.  ఈ పిటిషన్ పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో విచారణ జరుగుతుందని అనుకున్నారు. కానీ విచారణ వాయిదా పడింది.  ఈ పిటిషన్ ను చూపుతూ తాజాగా ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. అలాగే సీబీఐ ఇచ్చిన సమన్ల వ్యవహారంలో సమాధానం ఇచ్చిన కవిత ఈ కేసులోని అంశాలను వివరిస్తూ లేఖ రాసి విచారణకు హాజరయ్యేది లేదన్నారు.  ఈడీ కేసులో తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్  జనరల్  సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారన్నారు.  ఇదే హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని తన రిప్లై లో ప్రస్తావించారు.              

సుప్రీంకోర్టులో విచారణ జరగకపోవడతో  ఈడీ విచారణకు పిలవడంపై ఆంక్షలు ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే సీబీఐ విషయంలో మాత్రం స్పష్టత లేదు. విచారణకు  హాజరు కానందున సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. మరోసారి నోటీసులు జారీ చేస్తుందా లేకపోతే.. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నందున ఈడీ లాగే ఎదురు చూస్తుందా అన్నది తేలాల్సి ఉంది.                                                                       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget