అన్వేషించండి

Kalvakuntla Kavitha Chit Chat: అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేస్తా - రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: మేలో కొత్త పార్టీ పెట్టనున్నట్లుగా కవిత ప్రకటించారు. తన మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట నుంచి పోటీ చేయడమన్నారు.

Kavitha Entry from Siddipet: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మీడియా ప్రతినిధులోత నిర్వహించిన  ఇష్టాగోష్టిలో కీలక వివరాలు వెల్లడించారు.  తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి, ఇకపై రాజకీయ క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.

పార్టీ పేరుపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. తాను స్థాపించబోయే పార్టీ పేరులో ఖచ్చితంగా  తెలంగాణ  అనే పదం ఉంటుందని కవిత ధృవీకరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీల్లో తెలంగాణ అని లేదని..  తెలంగాణ రాష్ట్ర సమతిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ..  తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ లేకుండా పోయిందని ఆమె భావిస్తున్నారు. అందుకే తెలంగాణ పేరును తన పార్టీలో పెట్టాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ విధానాలతో విబేధించి బయటకు వచ్చిన తాను, ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాసనమండలిలో రాజీనామా ఆమోదం పొందే ముందు  ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను.. ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే కొత్త ప్రత్యామ్నాయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.                                            

తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని, తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూనే, తన ప్రాధాన్యతలను వెల్లడించారు. పోటీకి సంబంధించి మొదటి చాయిస్‌గా సిద్దిపేటను, రెండో చాయిస్‌గా బోధన్‌ను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఇప్పటికే  జాగృతి జనం బాట  కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. హరీష్ రావును కవిత మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధిపేట నుంచే పోటీ ఆలోచన ఉన్నట్లుగా ప్రకటించడం హైలెట్ అవుతోంది. సిద్దిపేట గతంలో కేసీఆర్ కంచుకోటగా ఉండేది. ఆయన తర్వాత హరీష్ రావు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.                                        

బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, సరైన వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.   కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget