అన్వేషించండి

Karimnagar Crime News:వయాగ్రాతో వర్కౌట్ కాలేదు! బీపీ, నిద్రమాత్రలు పని చేశాయి! కరీంనగర్‌లో భర్తను కిరాతకంగా చంపిన భార్య

Karimnagar Crime News:భర్తను చంపాలని డిసైడ్‌ అయిన ఆమె ఒకసారి విఫలమైంది. అయినా పట్టు వదలకుండా రెండోసారి ప్రయత్నించి విజయవంతమైంది. అంతా నేచురల్‌గానే చేసింది. కానీ ఒక్క తప్పు ఆమెను జైలుపాల్జేసింది. 

Karimnagar Crime News: కరీంనగర్‌లో వెలుగు చూసిన ఓ హత్య కేసు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణంగా ప్రేమించిన భర్తను కర్కశంగా చంపేయడంతో పోలీసులే షాక్ అయ్యారు. మద్యానికి బానిసైన వ్యక్తి డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నాడు. ఆ బాధలను భరించలేక స్పాట్ పెట్టి ఖతం చేసింది. కానీ తర్వాత మేనేజ్ చేయడం రాక పోలీసులకు చిక్కింది. 

కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో కత్తి మౌనిక, సురేష్ నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యానికి డబ్బులు కావాలంటూ ఆమెను చిత్రవధ చేశాడు. 

భర్త సురేష్ వేధింపులు భరించలేక మౌనిక తప్పుడు మార్గం పట్టింది. సెక్స్‌వర్కర్‌గా మారి డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. అలా సంపాదించి ఇస్తున్న డబ్బులు ఇస్తున్నప్పటికీ భర్తకు సంతృప్తి కలగలేదు. దీంతో భర్త పీడ వదిలించుకుంటే ప్రశాంతంగా జీవించవచ్చని భావించిందేమో. బంధువులతో తన మనసులో మాటను చెప్పింది. వారించాల్సిన వాళ్లు కూడా ప్రోత్సహించారు.       

సురేష్ హత్యకు ప్లాన్ చేసిన మౌనిక తన బంధవులకు సలహా అడిగింది. వయాగ్రా మాత్రలు కొనుక్కొని వచ్చి ఎందులోనైనా కలిపి ఇవ్వాలని చెప్పారు. అన్నట్టుగానే వయాగ్రా మాత్రలు కొనుక్కొని వచ్చిన మౌనిక ఒక రోజు కూరలో వయాగ్రా మాత్రలు కలిపేసి వడ్డించింది. తింటున్న క్రమంలో ఏదో తేడాగా ఉందని అన్నాడు. వాసన వస్తుందని తినడం మానేశాడు. దీంతో మొదటిసారి మర్డర్ స్కెచ్‌ ఫెయిల్ అయ్యింది.         

దీంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేసింది మౌనిక. బీపీ, నిద్రమాత్రులు పొడి చేసింది. వాటిని సురేష్ తాగే మద్యంలో కలిపేసింది. ఆ విషయం గుర్తించ లేకపోయిన సురేష్ వాటిని తాగేశాడు. అంతే నిద్రలోకి జారుకున్నాడు. అలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత జాగ్రత్త ఆయన మెడకు చీరను బిగించింది. తర్వాత కిటికీ గ్రిల్‌కు వేలాడదీసింది. చనిపోయిన తర్వాత బెడ్‌పై వేసింది. లైంగిక చర్యలో పాల్గొంటూ పడిపోయాడని అత్తమామలకు చెప్పింది.       

మౌనిక మాటలు విన్న అత్తమామ వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. మెడపై మచ్చలు ఉండటంతో వైద్యులకు అనుమానం వచ్చింది. విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి అనుమానాస్పద కేసుగా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. మౌనిక చెప్పే మాటలు పొంతన లేకపోవడంతో ఆమెపై నిఘా పెట్టారు.       
 
భర్త చనిపోయాడన్న బాధ లేని మౌనికను పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమె తీరు, ఫోన్ కాల్స్‌, ఇతర అన్ని విషయాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే మౌనిక అసలు రూపం తెలిసింది. అంతే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించింది. ఆమె చెప్పే మాటలు విన్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు. ఆమెతోపాటు ఆమెకు సహకరించిన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget