అన్వేషించండి

Modi Telangana Tour: మోదీ రామగుండం టూర్‌పై తీవ్ర వ్యతిరేకత, అడ్డుకొని తీరతామని హెచ్చరికలు!

ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కూడా ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన వివాదాస్పదం అవుతుంది. వామపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకొని తీరతామని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు హెచ్చరించాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని మోదీని అడ్డుకుని తీరుతామని తాజాగా జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఏడాది క్రితమే ఉత్పత్తిని ఆరంభించిందని, దాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. గోదావరిఖనిలో కార్మిక సంఘాల నాయకులు బుధవారం (నవంబరు 9) మీడియాతో మాట్లాడారు.

బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధానికి నిరసన సెగ తగలాలని చెప్పారు. గోదావరి ఖనిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేస్తున్నామని చెప్పారు. 

యూనివర్సిటీ స్టూడెంట్స్ జేఏసీ కూడా
మరోవైపు, ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కూడా ప్రకటించింది. యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మోదీ పర్యటన అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఈ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు గత సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీలోఆమోదం తెలిపారు. దానికి గవర్నర్‌ ఆమోదించకపోవడంపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఒకలా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జేఏసీ నాయకులు ఆరోపణలు చేశారు.

Also Read: Hyderabad: 30 టీమ్‌లతో ఈడీ అధికారులు రంగంలోకి, మంత్రి గంగుల ఇంట్లోనూ సోదాలు!

తెలంగాణ వికాస సమితి కూడా
ఇటు, తెలంగాణ వికాస సమితి కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తోంది. ఇటీవల తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మాట్లాడిన ప్రతిసారీ.. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణను అవమానిస్తున్నారని, అందుకే ప్రధాని మోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం కావడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తోందని, రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికి న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు కట్టబెట్టి సింగరేణిని కూడా అంతం చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని అన్నారు. మోదీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. కృష్ణ జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోదీ.. తమ రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించారని గుర్తు చేశారు.

Also Read: PM Modi Telangana visit: తెలంగాణలో మోదీ పర్యటన, అప్పుడే మొదలైన ప్రొటోకాల్ వివాదం - మరోసారి కేసీఆర్ డౌటే!

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget