అన్వేషించండి

Jagityal: బంగారాన్ని బ‌స్సులో మ‌రిచిపోయిన ప్రయాణికురాలు- తిరిగి అప్ప‌గించిన ఆర్టీసీ కండ‌క్ట‌ర్

TSRTC Conductor: 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కండక్టర్ తిరిగి ప్రయాణికురాలికి అందించింది.

TSRTC Conductor Handover Gold To its Owner:

పెద్దపల్లి నుంచి జగిత్యాల ఆర్టీసీ బస్సు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ మహిళ ఆ బస్సెక్కింది.. కొద్దిసేపటికి డ్రైవర్, కండక్టర్‌కు చెప్పకుండా దిగిపోయింది. బ్యాగును బస్సులు మరిచిపోయి వెళ్ళిపోయింది. దీంతో అధిగమించిన కండక్టర్,  డ్రైవరు తిరిగి ప్రయాణికురాలికి అప్పగించి ఉదారతను చాటుకున్నారు. ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు రూ. 8 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల బ్యాగును బ‌స్సులోనే మ‌రిచిపోయింది. ఆ బ్యాగును గ‌మ‌నించిన ఆర్టీసీ మ‌హిళా కండ‌క్ట‌ర్.. ప్ర‌యాణికురాలికి తిరిగి అప్ప‌గించింది.

ఆర్టీసీ బస్సుల్లో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు.. ప్రయాణికుల్లో కొందరు హడావిడిలో బస్సుల్లో లగేజీని మర్చిపోయి దిగిపోతుంటారు.. ఒక్కోసారి ఆ బ్యాగుల్లో బంగారం, డబ్బులు వంటివి కూడా ఉంటాయి. ప్రయాణికులు పొరపాటు చేసినా.. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం వాటిని తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా జగిత్యాల లో ఓ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అందించి ప్రశంసలు అందుకున్నారు.

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు. బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ప్రయాణికులకు అందజేసి మరో మారు నిజాయితీని చాటుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.

వివ‌రాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి పెద్ద‌ప‌ల్లి నుంచి జ‌గిత్యాల వెళ్లే ఆర్టీసీ బ‌స్సులో ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు ప్ర‌యాణించింది. జ‌గిత్యాల రాగానే ఆమె త‌న బ్యాగ్‌ను బ‌స్సులోనే మ‌రిచి, దిగిపోయింది. బంగారు ఆభ‌ర‌ణాల‌తో కూడిన బ్యాగ్‌ను మ‌హిళా కండ‌క్ట‌ర్ గ‌మ‌నించింది. ఆ బ్యాగులో ఉన్న ఫోన్ నంబ‌ర్ ఆధారంగా ప్ర‌యాణికురాలికి స‌మాచారం చేర‌వేసింది.

జ‌గిత్యాల డిపో మేనేజ‌ర్ స‌మ‌క్షంలో బంగారు ఆభ‌ర‌ణాల‌తో కూడిన బ్యాగ్‌ను బాధిత ప్ర‌యాణికురాలికి అప్ప‌గించారు. కండ‌క్ట‌ర్ వాణి నిజాయితీని డిపో మేనేజ‌ర్ అభినందించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం సుర‌క్షితం, ప్ర‌యాణికుల ప‌ట్ల ఇది త‌మ నిబద్ద‌త అని డిపో మేనేజ‌ర్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణికురాలు భ‌వానీ మాట్లాడుతూ.. తన నగలు దొరకక పోయి ఉంటే ద‌స‌రా పండుగ కన్నీళ్ళతో గడిచేదని పేర్కొన్నారు. నిజాయితీగా తన బంగారు ఆభరణాలను అందించిన కండక్టర్ వాణికి, డ్రైవ‌ర్ తిరుప‌తికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.

పలువురు అభినందనలు

నిజాయితీగా బంగారు ఆభరణాలను తిరిగి ప్రయాణికురాలికి సురక్షితంగా అందజేసిన కండక్టరు వాణికి, డ్రైవరు తిరుపతికి తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. రోడ్డుపై పది రూపాయలు కనిపిస్తే తీసుకునే ఈ రోజుల్లో 8 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను తిరిగి అప్పగించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి దుర్బుద్ధికి పోకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించి, తోటి ప్రయాణికురాలికి అండగా నిలిచినందుకు అటు కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రయాణికురాలు వారు చేసిన మేలును జన్మలో మర్చిపోలేని వెల్లడించారు. మున్ముందు అన్ని సహాయ సహకారాలు వారికి అందిస్తానని వెల్లడించారు. తన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చినందుకు డ్రైవర్ తిరుపతికి కండక్టర్ వాణి కి, ఆర్టీసీ యాజమాన్యానికి, స్థానిక డిపో సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
CM Revanth Reddy: తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget