News
News
X

కరీంనగర్‌ జిల్లాలో ఊపందుకోనున్న వరి కోతలు- ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

ధాన్యం సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందన్నారు.

FOLLOW US: 
 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ట్రాక్ హార్వెస్టర్లను సిద్ధం చేసుకుని రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2.7 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈసారి సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో దానికి తగినట్టుగా 30 వేల నుంచి 40 వేల ఎకరాల వరకు సన్న రకాలు సాగు చేశారు. దిగుబడి తక్కువగా ఉండడంతోపాటు డిమాండ్ కారణంగా వ్యాపారులు.. రైస్ మిల్లర్లు వీటిని ఎక్కువ ధరకు చెల్లించి నేరుగా కొనే అవకాశం ఉంది. 

ఈసారి నవంబర్ మొదటి వారంలో వరి కోతలు ప్రారంభమై చివర వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఎకరాకు 22 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చినా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం దాదాపుగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు దిగుబడి వచ్చినా 4.5 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయానికి తీసుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కరీంనగర్ హుజరాబాద్‌ను సెక్టార్లుగా విభజించి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌ పోర్ట్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు పూర్తి అయిన తర్వాత 24 గంటల్లోగా రైతులకు డబ్బు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ధాన్యంలో 17 శాతానికి మించి తేమ ఉండకుండా చూసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. ఆరు శాతం వరకు తాలు రంగు మారిన ధాన్యం ఉన్న అంగీకరిస్తామని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పుస్తకం బ్యాంక్ పాస్‌బుక్‌తోపాటుప ఆధార్ కార్డుల జిరాక్స్‌లను కొనుగోలు సమయంలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు

ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని దీనికి అవసరమైన నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసరఫరాల సంస్థకు అందించారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 7100లకుపైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతోపాటు అవసరమైన చోట మరో వంద వరకూ ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు నిర్ధిష్ట ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి గంగుల. 

News Reels

ఈసారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీబ్యాగులు అవసరమని ఇప్పటికే 14 కోట్ల గన్నీలను సేకరించామని, కొనుగోలు జరుగుతన్న క్రమంలో మిగతా గన్నీలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సమగ్ర సామాగ్రీ అందుబాటులో ఉందన్నారు. రాబోయే రెండున్నర నెల్ల పాటు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించేలా యంత్రాంగాన్ని సిద్దం చేసామన్నారు, దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

Published at : 26 Oct 2022 02:24 PM (IST) Tags: paddy Karimnagar Gagnula Kamalakar

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Siddipet District News: ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఈటల రాజేంద్ర

Siddipet District News: ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఈటల రాజేంద్ర

KCR Jagtial Visit: రేపు జగిత్యాలకు రానున్న సీఎం కేసీఆర్ - ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన

KCR Jagtial Visit: రేపు జగిత్యాలకు రానున్న సీఎం కేసీఆర్ - ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

టాప్ స్టోరీస్

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్