Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమే - కేసీఆర్ నిర్ణయంతో 40 వేల కోట్ల నష్టం!
Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ అంతా ప్రచార ఆర్భాటమేనని ఎమ్మెల్సీ జీవర్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల 40 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఫైర్ అయ్యారు.
Jeevan Reddy on KCR: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమేనని అన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల విద్యుత్ సంస్థలకు 40 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. కేసీఆర్ నువ్వు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నావ్.. అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సబ్ స్టేషన్ల దగ్గర రైతులు ఆందోళనకు దిగుతున్నారని.. తెలంగాణ ప్రాంతంలో బోరు బావుల మీద ఆధారపడే రైతులు ఎక్కువ అని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ పై ఎండీ ప్రభాకర్ ఒక క్లారిటీ ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 4000 విద్యుత్ మెగా వాట్ల ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోక పోవడం శోచనీయం అన్నారు.
ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచెందుకే ప్రజలపై భారం.
— T Jeevan Reddy MLC (@jeevanreddyMLC) January 31, 2023
ఏ సి డి చార్జీలు కాదు ఇది కేసీఆర్ పన్ను..
ఏసీడీ ఛార్జీలు చట్ట విరుద్ధం..
ధర్నాలో జీవన్ రెడ్డి గారు
రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు..@INCTelangana @SevadalTL @bharatjodo @INCIndiaLive pic.twitter.com/SeP8b0herC
యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు అనవసరం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. రామగుండంలో లేదా కొత్తగూడెంలో ప్రాజెక్టులో వేయాలని... కానీ యాదాద్రిలో పవన్ ప్రాజెక్ట్ వేయడం వృథా అని అన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు బొగ్గు రవాణా ఖర్చులు తలకు మించిన భారం అని చెప్పుకొచ్చారు. కమిషన్ల కక్కుర్తి కోసం యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనతో ఈరోజు 40వేల కోట్ల భారం పడుతుందని ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంట్ మాతో కాదని ప్రభుత్వం చెప్పాలని సూచించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. ప్రతీ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో సరైన సమయానికి కరెంట్ ఇవ్వగలిగామన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ప్రశ్నించారు. కిలో వాట్స్ కు అదనపు డెవలప్మెంట్ కు అదనపు ఛార్జీలు వేస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు.
ఎందుకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నరు..
అదనపు డిపాజిట్ ఎందుకు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిరుపేద వర్గాలపై దొడ్డిదారిన అదనపు ఛార్జీలు వేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణపై ఎందుకు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ మేము ఎప్పుడు అడగలేదని అన్నారు. పంటలకు సరిపడా కరెంట్ అడిగామన్నారు. 13 గంటలకు కరెంట్ సరిపోతుందని చెప్పారు. అదనపు కాంజెక్షన్ ఛార్జీలు వెంటనే ఆపాలన్నారు. సొలార్ పవర్, థర్మల్ పవర్ కంటే తక్కువ యూనిట్స్ ఉంటుందన్నారు. తెలంగాణలో 40 సాతం విద్యుత్ సరఫరా లోటు ఉందన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు తెలంగాణాకు గుది బండలాగా మారాయని అన్నారు. ఇప్పటికైనా కరెంటు కొన్ని గంటల పాటు తగ్గిస్తామని ప్రకటించి, భారాన్ని తగ్గించాలని సూచించారు.