Minister Gangula: భాష్యం విజయ సారథి మరణం రాష్ట్రానికి తీరని లోటు: మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula: పద్మశ్రీ భాష్యం విజయ సారథి సంస్మరణ సభలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Minister Gangula: భాష్యం విజయ సారథి లేరన్న పదాన్ని తమతో పాటు తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నామని రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విజయ సారథికి తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని.. ఆయన లేని లోటు రాష్ట్రానికి మన జిల్లాకు తీరని లోటని వివరించారు. కరీంనగర్ లోని యజ్ఞ వరాహ స్వామి దేవస్థానంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయ సారథి సంస్మరణ సభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... భాష్యం విజయ సారథితో సమాలోచనలు చేయనిదే తాను ఏ కార్యక్రమం చేపట్టలేదని, ఎన్నికల్లో తన నామినేషన్ తో సహా తన సలహా మేరకే చేసేవాడిని అన్నారు. భాష్యం ఎప్పుడు కలిసినా దేశం కోసం ధర్మం గురించే ఎక్కువగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
భాష్యం విజయ సారథిని గౌరవించుకుంటే దేవుడిని గౌరవించినట్లేనని, ఎప్పుడు ఆయన గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తరపున తనదేనని మంత్రి అన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు తనకు ఏ అవకాశం ఇచ్చినా వరంగా భావించే వాడినని అన్నారు. భాష్యం విజయ సారథి గౌరవార్థం ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో నిర్మించే అమృత వర్షిణి (కళాభారతి) పేరును భాష్యం విజయ సారథి కళా వేదికగా పేరు మార్పు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈ కళావేదిక ముందు భాష్యం కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. భాష్యం ఉన్నటువంటి వరాహ స్వామి దేవస్థాన మార్గాన్ని భాష్యం విజయ సారథి మార్గంగా పెట్టుకుందామని అన్నారు . సంస్కృతంలో పద్మశ్రీ అందుకొని గొప్ప స్థాయిలో మన జిల్లాకు కీర్తి ప్రతిష్టలను అందించిన భాష్యం ఆలోచనలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించటానికి కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు. భాష్యం రాసిన పుస్తకాలు చిరస్థాయిగా ఉండేలా జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఆయన సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి అందించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు .
64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రైతులకు చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా అత్యద్భుతంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అక్టోబర్ 21న ప్రారంభమైన వానాకాలం పంట సేకరణ మూడునెల్లకు పైగా 94 రోజులు నిరంతరాయంగా నిర్వహించామని, మారుమూల ప్రాంతాల రైతులు సైతం రవాణా కోసం వెతలు పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలో 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9 లక్షల 76వేల మంది రైతుల నుండి సేకరించామన్నారు . ఓపీఎంఎస్లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.