By: ABP Desam | Updated at : 19 Apr 2022 07:01 PM (IST)
మంగపేట గ్రామస్థులు ప్రజలు వెళ్లే దారి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మంగపేట గ్రామస్థులు దశాబ్దాలుగా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలాలతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ చెరువుకి నీరు వదిలినప్పుడల్లా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడం సాధారణమైపోయింది.
ముంపు భయం
ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గంగాధర ఎల్లమ్మ చెరువుని ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో నీటితో నింపుతున్నారు. దీంతో ఆ చెరువు పక్కనే ఉన్న మంగపేట గ్రామంలోని ఇళ్లు, వ్యవసాయ భూములు బావులు ముంపునకు గురయ్యాయి. దాదాపు 90 ఎకరాల వరకూ పచ్చని పంట పొలాలు, అందులో మునిగిపోయాయి. దీంతో రైతుల జీవనోపాధి దెబ్బతింది. అయితే ఎవరికీ కూడా సరైన నష్టపరిహారం అందలేదని రైతులు తమ బాధ వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు సౌకర్యం
ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని అక్కడ ఉన్న బ్రిడ్జి వల్ల కూడా ప్రయాణం చేయాలంటేనే భయమేసే విధంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇక వర్షాకాలంలో అయితే పాములు, తేళ్లు ఇంట్లోకి రావడం సాధారణంగా తయారైందని అంటున్నారు. నాలుగేళ్ల నుంచి సర్వే పేరిట హడావుడి చేస్తున్నారు. అధికారులు వస్తున్నారు పోతున్నారే తప్ప అధికారులు కూడా తమకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
జీవనోపాధి దూరం
తాతలు తండ్రులు బతికిన ఊరిలో తాము మాత్రమే మిగిలే పరిస్థితి ఉందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తి చేసుకుని బతికే మహిళల పరిస్థితి మరో విధంగా ఉంది. తాము గొర్రెలు కాచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని.. ఇప్పుడు ఎటువైపు మేతకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో జీవనోపాధి కోల్పోతున్నామనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలాంటి దారి
సాధారణంగా మెట్రో సిటీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి వాడే డిజైన్‌ని ఇక్కడ ప్రధాన రహదారిగా మార్చారు అధికారులు. బైక్‌పై బ్రిడ్జి మీదుగా వెళ్ళడానికి ఏపీబీ దేశం ప్రతినిధి ప్రయత్నించారు. దీంతో గ్రామస్తుల సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. కేవలం నాలుగైదు అడుగుల వెడల్పుతో కట్టిన బ్రిడ్జే గ్రామస్తులకు రవాణా సౌకర్యం.
చందాలతో సమస్యకు పరిష్కారం
బ్రిడ్జి, చెరువు సమస్య నుంచి బయటపడాలన్న సంకల్పంతో ఊరంతా కలిసి చందాలు వేసుకొన్నారు. తలా కొంత వేసుకొని స్థానిక గుట్ట ప్రాంతాన్ని చదును చేసుకుని కొత్త ఊరి నిర్మాణం మొదలుపెట్టారు. పాత ఊరి జ్ఞాపకాలను వదిలి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఒక ఊరికి వచ్చిన కష్టాన్ని ఐకమత్యంగా ఉంటేనే తాము బయట గలమని వారంతా భావిస్తున్నారు.
Karimnagar: ఈసారి మామిడి పచ్చళ్ళు అంతంతమాత్రమే! రెండు రెట్లు ఎగబాకిన ధరలు
Karimnagar News : ప్రభుత్వం ఓకే చెప్పింది ..కానీ భూమి ఏది ? క్రీడా మైదానాల కోసం ఎన్ని కష్టాలో
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్నే బురిడీ - రూ.లక్షలు హుష్కాకీ!
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !