By: ABP Desam | Updated at : 03 Jan 2022 03:41 PM (IST)
కోర్టు నుంచి బండి సంజయ్‌ను తరలిస్తున్న పోలీసులు
గత రాత్రి జన జాగరణ దీక్ష నుంచి అరెస్టు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కాసేపటి క్రితం కరీంనగర్ కోర్టులో హాజరుపర్చారు. ధర్మాసనం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహింపజేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై సభలు, సమావేశాలు ఆయన నిర్వహించుకొనేందుకు అనుమతి లేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. బండి సంజయ్‌పై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామని.. మొత్తం 25 మందితో పాటు మరికొందరిపై కరోనా నిబంధనల కింద కేసులు పెట్టామని కరీంనగర్ సీపీ తెలిపారు. బీజేపీ శ్రేణులు కావాలనే పోలీసులపై దాడికి దిగారని సీపీ తెలిపారు.
అయితే, బండి సంజయ్ చేస్తున్న పోరాటం బీజేపీ అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. అయితే, ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నట్లుగా కార్యాలయ సిబ్బంది నడ్డాకు తెలిపారు. స్పందించిన నడ్డా.. బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తున్న తీరు భేష్.. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు.. మేం చూసుకుంటాం.. అవసరమైతే కోర్టులో పోరాడదాం. జాతీయ నాయకత్వం సంజయ్ జీకి మద్దతుగానే ఉంటుంది’’ అని జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరకు భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. అక్కడికి సీపీ కూడా చేరుకోవటంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Karimnagar News : ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు, జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ధర్మపురి యువకుడు
Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Lokmanya Tilak Express : కరీంనగర్ కు లోకమాన్య తిలక్ రైలు పునరుద్ధరణ, రైల్వేశాఖ మంత్రికి ఎంపీ అర్వింద్ రిక్వెస్ట్
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం