News
News
X

Karimnagar News : ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు, జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ధర్మపురి యువకుడు

Karimnagar News : దేశంలో ప్రతిష్ఠాత్మక ఆరు ఐఐటీల్లో ఒకేసారి సీటు సాధించాడు ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఆదిత్య అనే విద్యార్థి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న ఈ యువకుడు జాతీయస్థాయి పరీక్షల్లో తన ప్రతిభను చూపించాడు.

FOLLOW US: 
Share:

Karimnagar News : ఐఐటీలో సీటు రావడం మాటలు కాదు. ఎంతో కఠోర శ్రమ ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో అవలీలగా సీటు సాధించాడో యువకుడు. ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు సాధించాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన ఆదిత్య గేట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా స్థాయిలో 24వ ర్యాంకు సాధించి మొదటి విడతలోనే ఆరు ఐఐటీల్లో సీటు సంపాదించాడు. చదువులో మొదటి నుంచి ముందు వరుసలో ఉండే అదిత్య ఎస్ఎస్సీ కరీంనగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ట్రినిటీ కాలేజీలో ఇంటర్ టాపర్ గా నిలిచి ఎంసెట్లో ర్యాంకు ద్వారా హన్మకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ సీటు సంపాదించాడు. ఆ తరువాత గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంటెక్ సీటు సంపాదించాడు. తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి టీసీఎస్ కి ఎంపికయ్యాడు. మరికొద్ది రోజులకే మరోసారి జూనియర్ టెలికం ఆఫీసర్ హోదాలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగానికి ఎంపికై కేరళలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. 

గేట్ పరీక్షతో సీట్ల దండయాత్ర ఇలా

బీఎస్ఎన్ఎల్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆదిత్య తన చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు గేట్ పరీక్షకి ప్రిపేర్ అయి మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి ఏకకాలంలో 6 ఐఐటీల్లో మొదటి విడతలోనే సీటు లభించింది. దిల్లీ, ముంబయి, రూర్కీ, మద్రాస్ ,గౌహతి , ఖరగ్పూర్ లలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీల్లో అడ్మిషన్ సాధించిన ఆదిత్య సక్సెస్ నిజంగా వండర్ అని చెప్పవచ్చు .ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తన లక్ష్యంగా చెబుతున్న ఆదిత్య ఇప్పటికే ఆ పరీక్ష కోసం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి అందులోనూ ప్రిలిమ్స్ పూర్తి చేయడమే కాకుండా మెయిన్ పరీక్ష కూడా సెలెక్ట్ అయ్యాడు. దిల్లీ ఐఐటీలోని కంట్రోల్ అండ్ ఆటోమేషన్ తో పాటు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రెండు విభాగాల్లోనూ ఆదిత్యకు అవకాశం దక్కింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు ఆదిత్య. దీనికి సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది. వరస విజయాలు సాధిస్తున్న ఆదిత్య కమిట్మెంట్ పట్ల స్థానిక ధర్మపురి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువు పట్ల శ్రద్ధ చూపేలా చేసిన అతని పేరెంట్స్ కాకేరీ లలిత , సనత్ కుమార్ లని  అభినందిస్తున్నారు. 

Published at : 21 May 2022 10:55 AM (IST) Tags: TS News Karimnagar news GATE Exam IITs All India Rank

సంబంధిత కథనాలు

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?

TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు