News
News
వీడియోలు ఆటలు
X

Jagitial News: 15 మంది సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక- అధికారులను సైతం కలవరపెడుతోన్న లేఖలు

Jagitial News: జగిత్యాల జిల్లాకు చెందిన 15 మంది గ్రామ సర్పంచులకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. వీరితో పాటు నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి లేఖలు అందాయి. 

FOLLOW US: 
Share:

Jagitial News: జగిత్యాల జిల్లాలోని 15 గ్రామాల సర్పంచులతో పాటు నర్సింహులపల్లెకు చెందిన 12 మంది గ్రామస్థులకు మావోయిస్టు నేతలు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్ ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15 మంది సర్పంచ్ లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపుతోంది. శుక్ర, శని వారాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓలు, నర్సింహులపల్లెలోని మరో 12 మందికి హెచ్చరికలు వచ్చాయి. మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి.

లేఖల్లో ఏముందంటే..?

అటవీ భూములు ఆక్రమిస్తూ అక్రమంగా పట్టాలు జారీ చేస్తున్నారని.. ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయతీలను పోలీస్ స్టేషన్ల వరకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నర్సింహుల పల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూల్చి వేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్దతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు ఈ లేఖలను నిజంగానే మావోయిస్టులు జారీ చేశారా లేక ఎవరైనా కావాలని చేశారని అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బాధితులు ఎస్పీతో పాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంపై బీర్ పూర్ ఎస్సై అజయ్ ను వివరణ కోరగా... పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు. 

ఐదు రోజుల క్రితమే ఆజాద్ పేరిట మావోయిస్టుల లేఖ

వరంగల్ : తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

ఇటీవలే ఇద్దరు మావోయిస్టు సానుభూతి పరుల అరెస్ట్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ తెలిపారు. శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్పీ సురేష్ కుమార్ మట్లాడుతూ.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట్ మండలం మురళిగూడా గ్రామపంచాయతీలోని జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనంద్ రావు, నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన చేన్నగొని గణేష్ లను బెజ్జూర్‌ అటవి ప్రాంతంలో మావోయిస్డులను కలిసేందుకు వెళుతుండగా పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 5 జిలేటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధ్రువపత్రాలు, రెండు సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Published at : 07 May 2023 03:28 PM (IST) Tags: Telangana News Jagitial News Maoists Warning Narsimhulapalle Telangana Maoists Letters

సంబంధిత కథనాలు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

టాప్ స్టోరీస్

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!