అన్వేషించండి

Forest Officer Idea: అటవీ విస్తీర్ణం పెంచేందుకు అధికారుల అదిరిపోయే ఐడియా, ఏంటంటే?

Forest Officer Idea: జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారులు అడవి విస్తీర్ణం పెంచేందుకు అద్భుతమైన ఐడియాను అమల్లో పెట్టారు. డ్రోన్లను వాడుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలు నాటుతున్నారు. 

Forest Officer Idea: జగిత్యాల జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఆ శాఖ అధికారులు అద్భుతమైన ఐడియాను కనిపెట్టారు. అంతే కాదు అనుకున్న ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. వనాలను పెంచేందుకు ముందుగా విత్తనాలు వేయాలి. గతంలో అయితే హరిత వాహనాలను వీటి కోసం వాడుకున్నారు. కొన్ని చోట్లకు అయితే కాలి నడకన వెళ్లి విత్తులు నాటాల్సి వచ్చేది. కానీ ఇప్పడు సరికొత్త టెక్నీలజీని వాడుతూ అందిరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే అసలు ఏం చేస్తున్నారని అని అనిపిస్తోంది కదా..

డ్రోన్ల ద్వారా విత్తనాలు.. 
సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా సుదూర తీరాల్లో, గుట్టల్లోని ప్రాంతాల్లో విత్తనాలను నాటడానికి సీడ్ బాల్స్ ని వినియోగించారు. ఎత్తైన గుట్టలు, సమస్యాత్మ ప్రాంతాల్లోకి వెళ్లకుండానే... డ్రోన్ల ద్వారా దాదాపు 25 వేల విత్తనాలను వేశారు. అడవీ విస్తీర్ణం పెంచేందుకు డ్రోన్లు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అంటున్నారు.

"వన్ బిలియన్ మొక్కలు వేయాలనే ఉద్దేశంతోనే డ్రోన్లను వాడుతున్నాం. ముఖ్యంగా గుట్టలు, వెళ్లలేని ప్రాంతాల్లోకి సీడ్ బాల్స్ తయారు చేసి.. డ్రోన్స్ ద్వారా వేస్తున్నాం. కెమెరాల్లో చూస్తూ.. డ్రోన్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సీడ్ బాల్స్ వదులుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ లేని మొక్కలు ఎక్కువగా నాటేందుకు దృష్టి సారించాం. మారుత్ అనే స్వచ్చంధ సంస్థ వారు మాకు సాయం చేశారు. వీరి ద్వారానే మేము ఇన్ని మొక్కలను సులువగా నాటగలిగాం. " - వెంకటేశ్వరరావు, జిల్లా అటవీశాఖ అధికారి

ఇప్పటి వరకు 25 వేల సీడ్ బాల్స్..!

సాధారణంగా మొక్కలు నాటడానికి అత్యధిక సమయం తీసుకునే ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇలా వాడటం ద్వారా దాదాపు ఒక కిలో మీటరు వరకు అంబర్ పేట గుట్ట ప్రాంతంలో 25 వేల వరకు సీడ్ బాల్స్ వదిలేయగల్గినట్లు వివరించారు. విత్తనాలకు తగిన పోషకాలతో కూడిన సీడ్ బాల్  ద్వారా అటవీ విస్తరణ త్వరితగతిన జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు.

అందుకే విత్తనం నుండి మొక్కగా పరిణామం చెందే క్రమంలో ఎలాంటి క్రిమి కీటకాలకు ఆహారంగా మారే అవకాశం లేకుండా... విత్తనాలు తమ చుట్టూ ఉన్న మట్టి ద్వారానే పోషకాలను అందుకోగలుగుతాయని స్పష్టం చేశారు. దీనికి తోడుగా టెక్నాలజీ వాడడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటే ఈ ప్రక్రియను తాము త్వరగా పూర్తి చేయగల్గామని జగిత్యాల అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

హ్యాట్సాఫ్ టు ఫారెస్ట్ ఆఫీసర్స్..!

విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రియులు అధికారుల ఐడియాకు ఫిదా అయ్యారు. కొత్త టెక్నాలజీని వాడుకొని మొక్కలు పెంచడం అనేది చాలా మంచి విషయం అని చెబుతున్నారు. అంతరించి పోతున్న అడువుల విస్తీర్ణం పెంచేందుకు.. సరికొత్త టెక్నాలజీ వాడడం గర్వించదగ్గ విషయం అని అంటున్నారు. ఏది ఏమైనా అడవుల పెంపకం, విస్తీర్ణం పెంచడం వల్ల స్థానిక ప్రజలలతో పాటు అడవిలో ఉండే జంతువులకు కూడా మంచి జరుగుతుందని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget