By: ABP Desam | Updated at : 19 Jan 2023 07:10 PM (IST)
Edited By: jyothi
గుడాటిపల్లి భూనిర్వాసితులను కలిసి పొన్నం ప్రభాకర్ - సమస్యలపై ఆరా
Ponnam Prabhaker: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. భూ నిర్వాసితులతో అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను.. పొన్నం ప్రభాకర్ కు వివరించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ దేశ రాజధాని ఢిల్లీలో, ప్రముఖ నగరాల్లో పెట్టాలి కానీ.. ఖమ్మంలో పెట్టడం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశాడంటూ మండిపడ్డారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా పనులకు అడ్డు పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టు ను
— Ponnam Prabhakar (@PonnamLoksabha) January 18, 2023
హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి గారితో కలిసి
మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్
గారు సందర్శించడం జరిగింది pic.twitter.com/EBrzKHPNXP
"అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం లో పెట్టడం వెనుక ఉన్న మాథలబ్ ఏమిటి? రాష్ట్రం లో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త తెర తెరిచిండు. గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించ కుండా పనులకు అడ్డు పడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. కుర్చీ వేసుకుని కూర్చుండి ప్రాజెక్టు పూర్తి చేస్తా మన్న సీఎం 8 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు. మెట్ట ప్రాంత మైన హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ అసమర్దత వల్లే యాసంగి పంటకి నీళ్లు ఇవ్వడం లేదు. వివాహితులైన మహిళలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యల పరిస్కారం కోసం 100 రైతుల తో సీస్ శాంతి కుమారి కలిసి సమస్య వివరిస్తాం." - మాజీ పొన్నం ప్రభాకర్
జాతీయ పార్టీ అంటే ఎడనో ఢిల్లీ, ఉత్తర్ పరదేశ్ లేకనో కోల్కతా లో ఆవిర్భావ సభ పెట్టాలి కానీ ఖమ్మం రాజధాని అయినట్టు ఇవ్వాళ ఖమ్మం లో పెడుతుండు - పొన్నం ప్రభాకర్ @TelanganaCMO @BRSparty pic.twitter.com/Lf4QYEbgMZ
— Ponnam Prabhakar (@PonnamLoksabha) January 18, 2023
ఎనిమిదేళ్లుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు..!
కుర్చీ వేసుకుని కూర్చుండి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న సీఎం 8 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ ప్రాంత రైతులకు కేసీఆర్ అసమర్దత వల్లే యాసంగి పంటకు నీళ్లు అందడం లేదని ఆరోపించారు. వివాహితులైన నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇచ్చి త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసిత మహిళల సమస్యల పరిస్కారం కోసం, వంద మంది భూ నిర్వాసిత మహిళలను సీఎస్ శాంత కుమారి వద్దకు తీసుకెళ్లి ఆమెకు సమస్యను వివరిస్తామన్నారు.
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!