News
News
X

Karimnagar Mining Case: కరీంనగర్ మైనింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ, 9 కంపెనీలకు నోటీసులు!

Karimnagar Mining Case: కరీంనగర్ మైనింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 9 కంపెనీలకు నోటీసులు జారీ చేయగా.. పది మందిని ఈడీ అధికారులు విచారించారు. 

FOLLOW US: 
 
Karimnagar Mining Case: కరీంనగర్ మైనింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మైనింగ్ అక్రమాలపై మొత్తం తొమ్మిది కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 10 మంది వ్యాపారులు మైనింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో మొత్తం 30 ప్రాంతల్లో సోదాలు చేశారు. జరిగిన 750 కోట్లు.. అక్రమాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. రైల్వే, షిప్స్ లలో విదేశాలకు మైనింగ్  చేస్తూ వేల కోట్లు రూపాయలు ప్రభుత్వానికి గండి కొట్టినట్లు గుర్తించారు. అక్రమ మైనింగ్ పై ఐటీ, సీబీఐ, ఈడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు గత ఏడాది ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. 

అసలేం జరిగిందంటే..?

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రానైట్ ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ కలిగిన రాయిగా పేరుంది. చైనా లో జరిగినటువంటి ఒలంపిక్స్ తో  పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ముఖ్యమైన నిర్మాణాల్లో ఈ గ్రానైట్ ని ఇంటీరియర్ గా వాడుతుంటారు. అయితే 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించినటువంటి అధికారులకు ఈ గ్రానైట్ ను విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో కరీంనగర్ కు చెందిన అనేక సంస్థలకు నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు పెద్ద ఎత్తున జరిమానా విధించారు. 

మొత్తం జరిమానా దాదాపు 750 కోట్ల వరకు ఉంది. ఇంత భారీ ఎత్తున జరిమానా విధించడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది . దీనిపై ఇప్పటికీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ కొనసాగుతోంది .అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఈ  అక్రమ రవాణా వ్యవహారం ఎంతమాత్రం ముగియలేదని... ఇప్పటికీ అనుమతులు లేకుండానే ఎక్స్పోర్ట్ జరుగుతోందని పేరాల శేఖర్ రావు తన కంప్లైంట్లో పేర్కొనడంతో మళ్లీ దీనిపై విచారణకు ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీబీఐ దర్యాప్తు సంస్త ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

News Reels

మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా..!

ముఖ్యంగా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఎగుమతులు కూడా నిర్వహించడమే కాకుండా, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేతతో బాటు,  మనీలాండరింగ్, అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొనడం జరిగింది. దీంతో కేంద్ర విచారణ సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో పాటు పలు కేంద్ర సంస్థలు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఏ స్థాయిలో అక్రమంగా ఎగుమతి జరిగిందో తేల్చడానికి పూర్తి లెక్కలను బయటకు లాగుతున్నట్లు గా తెలుస్తోంది. ఏయే దేశాలకు ఎగుమతి చేశారు, ఈ అక్రమ ఎగుమతులపై ఎవరెవరు సహకరించారనే దానిపై కూడా సమాచారం కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ని అక్రమాలు చేయడానికి కాకినాడ పోర్టు నే ఎందుకు వాడుకున్నారనే అంశాలపై కూడా సీబీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అప్పట్లో మైనింగ్‌ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు బీజేపీ నేత శేఖర్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదుదారు అయిన శేఖర్ రావుకు సమాచారం అందినట్లు గా తెలుస్తోంది.

Published at : 18 Nov 2022 01:55 PM (IST) Tags: Telangana News Karimnagar News ED Issues Notices Karimnagar Mining Case ED Interagation on Mining Case

సంబంధిత కథనాలు

Mancherial News :  దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

Mancherial News : దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ- బండి సంజయ్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ-  బండి సంజయ్

MLC Jeevan Reddy: ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్!

MLC Jeevan Reddy: ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్!

Karimnagar Smart City: హడావుడిగా పనులు, వృథా అవుతున్న నిధులు - ఆ సమస్యలకు చెక్ పెట్టరా !

Karimnagar Smart City: హడావుడిగా పనులు, వృథా అవుతున్న నిధులు - ఆ సమస్యలకు చెక్ పెట్టరా !

Karimnagar News: సర్దార్‌జీకి టైం వచ్చింది- రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి!

Karimnagar News: సర్దార్‌జీకి టైం వచ్చింది- రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి!

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?