అన్వేషించండి

Indian National Anthem: నిరంతర జాతీయ గీతాలాపన, ఎక్కడో కాదు మన దగ్గరే

National Anthem: భారత స్వత్రంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ మరోమారు జమ్మికుంట పట్టణం వార్తల్లోకి ఎక్కింది. దాదాపు ఐదేళ్ల నుంచి అక్కడ ప్రతి రోజూ జాతీయ గీతాలాపన చేస్తున్నారు. 

Indian National Anthem: దాదాపు ఐదేళ్ల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది నిత్య జాతీయ గీతాలాపన. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు పట్టణంలో క్రమం తప్పకుండా జాతీయ గీతాన్ని మైకుల ద్వారా వినిపించే వారు. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చినా ప్రజలు ఎక్కడికి అక్కడ నిలబడి తాము కూడా గొంతు కలిపే వారు. ఇలా మొట్ట మొదటి సారిగా బహిరంగ ప్రదేశంలో నిత్య జాతీయ గీతాలాపన మొదలు పెట్టిన పట్టణంగా జమ్మికుంట పేరు గాంచింది. అయితే కేవలం మొదలు పెట్టడమే కాదు.. అప్పటి నుండి ప్రతి రోజు జాతీయ గీతాలాపన వినిపిస్తూనే ఉన్నారు.

అలా మొదలైంది... 
2017 లో ఆగస్టు 15వ తేదీన జమ్మికుంట పట్టణంలో ప్రశాంత్ రెడ్డి నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విషయం వార్తల ద్వారా నాయకులను ప్రజలను ఆకర్షించడంతో ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. యాభై రెండు సెకండ్ల పాటు వచ్చే పాటతో దేశభక్తిని చాటుకునేలా.. అప్పట్లో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు పొందింది. ప్రశాంత్ రెడ్డి హైదరాబాదులోని శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ భావాన్ని పెంపొందించుకునేలా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం తరువాత ఇతర రాష్ట్రాలు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కరీంనగర్ కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద, జగిత్యాల టవర్ సర్కిల్, రామడుగు మండలం గోపాల్ రావు పేట, జగిత్యాల జిల్లా కోరుట్ల, కొడిమ్యాల మండలం నల్లగొండ, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులోనూ, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడి ప్రజల్లో దేశభక్తిని నిరంతరం నింపుతోంది.

నిరంతర దేశభక్తి..

తాను సీఐగా ఉన్న సమయంలో ప్రజల్లో ఉన్న దేశభక్తిని నిరంతరం కొనసాగించాలనే తపనతో ఈ ఆలోచన చేశానని ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న అప్పటి జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు జాతీయ గీతం మొదలవగానే సెల్యూట్ చేస్తూ పాడుతుండటంతో.. క్రమ క్రమంగా ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాలకు విస్తరించారు. తన ఆలోచన సక్సెస్ కావడం పట్ల అమితమైన ఆనందం కలిగిందని సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సామూహికంగా చేసే ఈ గీతాలాపన ద్వారా సోదర భావం సమన్వయం పెరిగి శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ఆయన అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు దీనికి స్పందించి, అభినందించారని అయితే ప్రజలు చూపించే అభిమానం తన బాధ్యతలు మరింత పెంచిందని ఆయన వివరించారు. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అన్నట్లుగా ఒక ప్రాంతంలో ఉద్యమంలా మొదలైన సామూహిక జాతీయ గీతాలాపన ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడం నిజంగా జిల్లాకు గర్వ కారణం అని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget